హైదరాబాద్ : సన్ పిక్చర్స్ నిర్మాణంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం జైలర్ -2 . ఈ సినిమా సీక్వెల్ గా అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో భారీ విజయాన్ని నమోదు చేసింది. కేవలం 12 రోజుల్లోనే ఏకంగా రూ. 734 కోట్లు వసూలు చేసింది ప్రపంచ వ్యాప్తంగా. ఇందులో కీలక పాత్రలు పోషించారు రజనీకాంత్ , విద్యా బాలన్, మిథున్ చక్రవర్తి, మోహన్ లాల్, తదితరులు. ప్రధానంగా సూపర్ స్టార్ తలైవా మేనరిజం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘జైలర్ 2’ చిత్రం విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మరో మైలురాయిని అధిగమించింది. నెల్సన్ దిలీప్‌కుమార్ టేకింగ్, మేకింగ్ సినిమా సక్సెస్ కు కీలకంగా మారింది. ఆశించిన దానికంటే బాక్సులు నిండి పోయాయి. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ ఏకంగా భారీ గిఫ్టులను నటుడు రజనీకాంత్, దర్శకుడికి అందజేశారు.
ఇక విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది జైలర్ -2 .ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే ₹100 కోట్లకు పైగా వసూలు చేసింది. అంతేకాకుండా విడుదలైన 11 రోజుల్లోనే తమిళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కీలక పాత్ర పోషించారు. తాజాగా చిత్ర బృందం హృతిక్ రోషన్‌ను ఉద్దేశించి ‘రోడీ స్పెషల్ థీమ్’ అనే ప్రత్యేక థీమ్ సాంగ్‌ను విడుదల చేసింది.రజనీకాంత్ , హృతిక్ రోషన్‌లతో పాటు, ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, రమ్యకృష్ణన్, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, సూరజ్ వెంజారమూడు , విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం నటించారు.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. అద్భుతమైన తారాగణం , బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న వసూళ్లతో, ‘జైలర్ 2’ సినిమా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది.
