హైదరాబాద్ : ప్రముఖ నటుడు, ఎమ్మెల్సీ కొణిదల నాగబాబు పుట్టిన రోజు ఇవాళ. అక్టోబర్ 29న పుట్టిన రోజు సందర్బంగా సినీ , రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మెగా బ్రదర్‌పై ప్రేమను కురిపించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు సాయి ధరమ్ తేజ్ , నిర్మాత బండ్ల గణేష్. టాలీవుడ్ ప్రముఖ నటుడు, మన ప్రియతమ మెగా హీరో , ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ నాగబాబు నేడు తన 65వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, సాయి ధరమ్ తేజ్, నిర్మాత బండ్ల గణేష్ , మరికొందరు కూడా ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
బండ్ల గణేష్ తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. మన ప్రియతమ నాగబాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ‘ఏపీ గ్రీన్’ చైర్మన్‌గా, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అన్నయ్యా, మీకు నిరంతరం సంతోషం, మంచి ఆరోగ్యం , అపారమైన విజయాలు లభించాలని కోరుకుంటున్నాను. ప్రేమ , గౌరవంతో. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సందేశంలో ఇలా రాశారు. నా సోదరుడు నాగబాబుకి హృదయ పూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. శాసనమండలి సభ్యునిగా ,’ఏపీ గ్రీన్’ చైర్మన్‌గా ఆయన మరిన్ని గొప్ప సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. పర్యావరణ పరిరక్షణపై సహజమైన ఆసక్తి కలిగిన నాగబాబు ‘ఏపీ గ్రీన్’ చైర్మన్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తారని నాకు నమ్మకం ఉంది. నా సోదరుడికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
