CM KCR vs Etala Rajender : కేసీఆర్ నోట ఈటల మాట
ఆయన సూచనలు స్వీకరించండి
CM KCR vs Etala Rajender : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది వాస్తవం. ఒక్కోసారి ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారి పోతారు. తెలంగాణ ఉద్యమంలో ఇద్దరూ కలిసి నడిచారు. ఉద్యమ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆనాటి ప్రభుత్వాన్ని నిలదీశారు..నిగ్గ దీసి ప్రశ్నించారు. ఒకానొక దశలో సీఎం రేసులో కూడా ఉన్నారు ఈటల రాజేందర్. అనుకోని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఆయనను మెల మెల్లగా పక్కకు(CM KCR vs Etala Rajender) పెడుతూ వచ్చారు.
ఓ వైపు కూతురు ఇంకో వైపు కొడుకు మరో వైపు అల్లుడు మధ్యలో ఈటల రాజేందర్. కేసీఆర్ ది ముందు నుంచీ దొర మనస్తత్వం. ఎవరైనా సరే తన కింద ఉండాలని అనుకుంటాడు. తనకు ఎవరు ఎదురు తిరిగినా లేదా తనకంటే ఎక్కువ ప్రచారం దక్కినా ఆయన తట్టుకోలేడు. ఇదే విషయాన్ని ఈటల రాజేందర్ బహిరంగంగానే ప్రకటించాడు. కరోనా కష్ట కాలంలో అంతా భయంతో ఇళ్లల్లో, ఫామ్ హౌస్ లలో ఉంటే గవర్నర్ తమిళి సై , ఆనాడు మంత్రిగా ఉన్న సమయంలో ఈటల రాజేందర్ తమ వంతు ప్రయత్నం చేశారు.
అదును చూసి దెబ్బ కొట్టడంలో తనకు తానే సాటి కేసీఆర్. ఉన్నట్టుండి భూములను కబ్జా చేశారంటూ చెప్పకుండానే ఈటలపై వేటు వేశారు. దీంతో తాను తక్కువేమీ కాదని ఈటల రాజేందర్ ఢీకొనేందుకు సై అన్నారు. ఆపై తన పదవికి రాజీనామా చేసి బరిలో నిలిచారు. కేసీఆర్ మొత్తం ఫోకస్ పెట్టినా గెలవలేక పోయారు.
దీంతో ఈటల మరోసారి తానేమిటో నిరూపించుకున్నారు. తన సత్తా ఏమిటో చాటారు. ఒంటరిగా ఉంటే ఏమీ చేయలేనని గుర్తించిన ఈటల రాజేందర్ ఆ వెంటనే కేంద్రంలో పవర్ లో ఉన్న కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో కేసీఆర్ కు ఈటలను దెబ్బ కొట్టే ఛాన్స్ మిస్ అయ్యింది. అసెంబ్లీ నుంచే ఈటలను లేకుండా చేయాలని అనుకున్నాడు కేసీఆర్.
కానీ వర్కవుట్ కాలేదు. విచిత్రం ఏమిటంటే తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకనాడు తన నోటి నుంచి ఈటల పేరు ఉచ్చరించేందుకు ఇష్ట పడని కేసీఆర్ ఉన్నట్టుండి ఈటల రాజేందర్ పేరును పదే పదే ఏకంగా 12 సార్లు ప్రస్తావించారు సీఎం. దీంతో అసెంబ్లీ వేదికగా ఆసీనులైన స్పీకర్, మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అంతే కాదు ఈటల రాజేందర్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు కేసీఆర్. అంతే కాదు వాటిని మంత్రులు నోట్ చేసుకుని పరిష్కరించాలని ఆదేశించారు సభా సాక్షిగా. ఏది ఏమైనా ఈటల మామూలోడు కాదని కేసీఆర్ కు అర్థమైందా లేక రాజకీయ చాణక్యం ప్రదర్శించారా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : కేసీఆర్ రాజీనామా చేసే దమ్ముందా