CM KCR : యుద్దం చేయాల్సిందే బీజేపీని త‌ర‌మాల్సిందే

గులాబీ శ్రేణుల‌కు సీఎం కేసీఆర్ దిశా నిర్దేశం

CM KCR : ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ‌తామంటూ కొంద‌రు ప్ర‌బుద్ద‌లు ప్ర‌చారం చేస్తున్నారు. వీటిని న‌మ్మ‌కండి. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో తెలంగాణ‌లో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. ఒక ర‌కంగా చెప్పాలంటే అన్ని రంగాల్లో మ‌న రాష్ట్రం టాప్ లో ఉంది. దేశానికి దిశా నిర్దేశం చేసే స‌త్తా మ‌న రాష్ట్రానికి ఉంది.

ఇది ఆచ‌ర‌ణ‌లో నిరూప‌ణ కూడా చేసుకున్నాం. రాష్ట్ర‌మే రాద‌న్నారు కొంద‌రు స‌న్నాసులు. వ‌చ్చాక పాల‌న చేత కాద‌న్నారు. కానీ దేశం గ‌ర్వించేలా, సిగ్గు తెచ్చుకునేలా పాల‌న సాగుతోంద‌న్నారు. పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధులంతా ఇక నుంచి హైద‌రాబాద్ లో మ‌కాం బంద్ పెట్టి కార్య‌క్షేత్రంలోకి దూకాలన్నారు.

బీజేపీతో తాడో పేడో తేల్చుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఏ ఒక్క ఎమ్మెల్యేను మార్చే ప్ర‌స‌క్తి లేద‌న్నారు కేసీఆర్(CM KCR). ఎవ‌రి నియోజ‌క‌వ‌ర్గాల‌లో వారు ఉండాల‌ని ప్ర‌జల‌తో క‌ల‌వాల‌ని, వారికి ఉన్న స‌మ‌స్య‌లు ఏమిటో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇక నుంచి ప్ర‌తి రోజూ మ‌న‌కు ప‌రీక్ష లాంటిదేన‌ని హెచ్చ‌రించారు.

ఎప్ప‌టిక‌ప్పుడు బేరీజు వేసుకుని ఏం చేశామో చెప్పాలి. ఆపై మ‌రోసారి అవ‌కాశం ఇస్తే ఎలా అభివృద్ది చేస్తామో చెప్పేందుకు స‌న్న‌ద్దం కావాల‌ని పిలుపునిచ్చారు. బీజేపీతో టీఆర్ఎస్ ధ‌ర్మ యుద్దం కొన‌సాగిస్తూనే ఉంటుంద‌న్నారు. రాష్ట్రంలో బీజేపీ ఆట‌ల‌ను సాగ‌నీయ‌కుండా ముందుకు సాగాల‌న్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల‌కు అంత సీన్ లేద‌న్నారు.

వ‌చ్చే 10 నెల‌ల పాటు రాజ‌ధానిలో ఏ ఒక్క‌రూ క‌నిపించ కూడ‌ద‌ని అంతా త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లోనే మ‌కాం వేయాల‌ని ఆదేశించారు. లేక పోతే తీవ్ర చ‌ర్య‌లు ఉంటాయ‌ని వార్నింగ్ ఇచ్చారు.

Also Read : ఎమ్మెల్యేల‌ను మార్చం ముంద‌స్తుకు వెళ్లం – కేసీఆర్

Leave A Reply

Your Email Id will not be published!