CM KCR : మోసం కాంగ్రెస్ నైజం – కేసీఆర్
రైతు బంధు కావాలా రాబంధు కావాలా
CM KCR : ఆదిలాబాద్ – బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈనెల 30న పోలింగ్ జరగనుంది. ప్రచారంలో భాగంగా గురువారం ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.
CM KCR Slams Congress
మోసానికి చిరునామా కాంగ్రెస్ పార్టీ అని సంచలన ఆరోపణలు చేశారు. ఆనాడు తాను ఒక్కడినే తెలంగాణ కోసం బయలు దేరినప్పుడు ఇప్పుడు నోరు పారేసుకుంటుకున్న సన్నాసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు కేసీఆర్.
కేసీఆర్(CM KCR) సచ్చుడో బతుకుడో అని ప్రకటించిన..తెలంగాణ సాధించేంత వరకు హైదరాబాద్ లో అడుగు పెట్టనని చెప్పానని చేసి చూపించానని అన్నారు. ఇవాళ కోరి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ది చేయడం జరిగిందన్నారు కేసీఆర్.
మోసాలకు పెట్టింది పేరైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అభివృద్ది చెందిన తెలంగాణపై కన్ను పడిందన్నారు . కరెంట్ కావాలా లేక కాంగ్రెస్ కావాలా తేల్చు కోవాల్సింది మీరేనని అన్నారు సీఎం. రైతు బంధు కావాలా లేక రాబంధు లాంటి హస్తం పార్టీ కావాలా అని పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికి ఉందన్నారు. ఇవాళ అన్ని రాష్ట్రాలు తమ అభివృద్దిని చూసి అనుసరిస్తున్నాయని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు. ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా జాబ్స్ భర్తీ చేశామన్నారు సీఎం.
Also Read : Gudivada Amarnath : మా నిధులే కేంద్రం ఇస్తోంది