Gudivada Amarnath : మా నిధులే కేంద్రం ఇస్తోంది

ఐటీ శాఖ మంత్రి అమ‌ర్నాథ్

Gudivada Amarnath : అమ‌రావ‌తి – త‌మ రాష్ట్రానికి సంబంధించిన ప్ర‌జ‌లు పన్నుల రూపేణా చెల్లించిన డ‌బ్బుల‌ను తిరిగి కేంద్రంలో కొలువు తీరిన మోదీ స‌ర్కార్ త‌మ‌కు ఇస్తోంద‌న్నారు ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్ నాథ్(Gudivada Amarnath) . ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Gudivada Amarnath Comment

త‌మ‌కు ద‌యా దాక్షిణ్యంగా ఇవ్వ‌డం లేద‌న్నారు. భార‌త రాజ్యాంగం ప్ర‌కారం త‌మ రాష్ట్రానికి రావాల్సిన నిధులే ఇస్తోంద‌న్నారు. ఇందుకు సంబంధించి ఎలాంటి చ‌ర్చ‌ల‌కైనా తాను సిద్దంగా ఉన్నాన‌ని స్ప‌ష్టం చేశారు గుడివాడ అమ‌ర్ నాథ్.

కేంద్రం నుంచి స్వంతంగా నిధులేవీ ఇవ్వ‌డం లేద‌ని, ఈ విష‌యాన్ని రాష్ట్ర ప్ర‌జ‌లు గుర్తించాల‌ని అన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. 70 శాతం పోల‌వ‌రం క‌ట్టలేదు. గ‌తంలో ఏలిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిట్ట నిలువునా దోచుకున్నార‌ని, దాచుకునేందుకు అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఐటీ మంత్రి.

జ‌న‌సేన పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్ చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించారు. ఆయ‌న‌ను క‌ట్ట‌ప్ప తో పోల్చార‌ని పేర్కొన్నారు. ఏదో ఒక సంస్థ‌కు ఉచితంగా భూములు ఇచ్చేస్తున్నారంటూ పేర్కొన‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు గుడివాడ అమ‌ర్ నాథ్. ఎవ‌రో ఇచ్చిన స్క్రిప్టు చ‌ద‌వ‌డం త‌ప్ప చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు.

Also Read : AP CM YS Jagan : ఇళ్ల నిర్మాణం ఏపీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం

Leave A Reply

Your Email Id will not be published!