AP CM YS Jagan : ఇళ్ల నిర్మాణం ఏపీ ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ఏపీ సీఎం జ‌గన్ మోహ‌న్ రెడ్డి

AP CM YS Jagan : అమ‌రావ‌తి – ప్ర‌తి ఒక్క‌రికీ ఇల్లు క‌ట్టించి ఇవ్వాల‌న్న‌దే త‌మ ముఖ్య ఉద్దేశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. గురువారం గృహ నిర్మాణ శాఖపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌రిత‌గ‌తిన ఇళ్లు పూర్తి చేయాల‌ని ఆదేశించారు సీఎం.

AP CM YS Jagan Comment

ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. గ‌డిచిన అక్టోబ‌ర్ లో 7.43 ల‌క్ష‌ల ఇళ్ల‌ను ఇప్ప‌టికే అక్కా, చెల్లెమ్మ‌ల‌కు అంద‌జేశామ‌ని తెలిపారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఫిబ్ర‌వ‌రి నాటికి మ‌రో 6 ల‌క్ష‌ల ఇళ్లు పూర్తి చేసే దిశ‌గా ముందుకు సాగుతున్నామ‌ని ఉన్న‌తాధికారులు సీఎంకు వివ‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ప‌నులు ప్ర‌గ‌తిప‌థంలో ఉన్నాయ‌ని తెలిపారు. సీఎం ఆదేశాల మేర‌కు అక్టోబ‌ర్ లో ల‌బ్దిదారుల‌కు అందించిన ఇళ్ల‌కు సంబంధించిన మౌలిక స‌దుపాయాల‌పై నిశితంగా ప‌రిశీల‌న చేశామ‌ని వెల్ల‌డించారు.

విద్యుత్, తాగు నీరు స‌దుపాయాల‌ను క‌ల్పించామ‌ని స్ప‌ష్టం చేశారు. నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ జ‌ర‌పాల‌ని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) ఆదేశించారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న ప్ర‌తి ఇంటిని స‌దుపాయాలు ఉన్నాయా లేవా అన్న దానిపై ఆడిట్ చేయాల‌న్నారు సీఎం.

Also Read : Ponguleti Srinivas Reddy : కేసీఆర్ మోసం తెలంగాణ ఆగమాగం

Leave A Reply

Your Email Id will not be published!