CM KCR : స్టేషన్ ఘణపూర్ – గతంలో పాలన ఎట్లుండె ఇప్పుడు ఎట్లుందో ఆలోచించాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభలో ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో పూర్తిగా అవినీతి పెచ్చరిల్లిందన్నారు. ఆనాడు కరెంట్ కు కటకట, నీళ్లు లేక నానా తంటాలు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు.
CM KCR Comments about Congress Ruling
58 బోర్లు వేసినా చుక్క నీరు కూడా రాలేదన్నారు. ఆనాడు చుక్క సత్తయ్య కథ చెప్పారు కేసీఆర్(CM KCR). ఆనాడు ఒగ్గు కళాకారుడు ఎంతో ఖర్చు చేసినా నీళ్లు రాలేదని చెప్పారు. ఇవాళ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చాక సీన్ మారిందన్నారు. ఇవాళ తాగేందుకు నీళ్లు, సాగు చేసుకునేందుకు సమృద్దిగా నీళ్లు ఇస్తున్నామని అన్నారు కేసీఆర్.
ఇవాళ తాము తీసుకు వచ్చిన నిర్ణయాల కారణంగా లక్షా 10 వేల ఎకరాలకు నీళ్లు అందుతున్నాయని , సస్యశ్యామలం అయ్యిందని అన్నారు. ఆనాడు కడియం శ్రీహరి నీళ్లు కావాలని కోరిండు. తాను ఆయన కోరికను మన్నించి చచర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు సీఎం. ఇవాళ మల్కపురం రిజర్వాయర్ పూర్తయిందన్నారు.
Also Read : AP CM YS Jagan : రాష్ట్ర విభజన జగన్ ఆవేదన