KCR : తెలంగాణలో (Telangana) కాషాయం, గులాబీ దళం మధ్య యుద్ధం మొదలైంది. నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం పట్ల మొదటి నుంచి మోదీ సర్కార్ వివక్షను ప్రదర్శిస్తోందంటూ టీఆర్ఎస్ (TRS) ఆరోపిస్తోంది.
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ వస్తోంది గత కొంత కాలం నుంచీ.ఇవాల్టి నుంచీ కేంద్రంపై పోరాటానికి సన్నద్ధమైంది. మండల కేంద్రాలో దీక్షలతో వరుసగా ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, పోరాటాలకు పిలుపునిచ్చింది.
ఈనెల 11న దేశ రాజధాని హస్తినలో ప్రత్యక్ష పోరాటానికి పిలుపునిచ్చింది టీఆర్ఎస్ (TRS) . ఇందులో భాగంగా ముందస్తుగానే ఢిల్లీకి బయలు దేరారు సీఎం కేసీఆర్(KCR ). బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరారు.
ఆయన దీక్షలో పాల్గొంటారు. తెలంగాణకు (Telangana) జరుగుతున్న అన్యాయం గురించి మోదీ (Modi) సర్కార్ కు తెలియ చేసేలా పోరాటానికి శ్రీకారం చుట్టారు సీఎం.
ఇందులో భాగంగా ఉద్యమ కార్యాచరణపై సీఎం కేసీఆర్ (KCR) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీబి, డీసీఎంఎస్ చైర్మన్లు, పార్టీ బాధ్యులకు దిశా నిర్దేశం చేశారు.
ఇక నుంచి పోరాటమే మన లక్ష్యం కావాలని ఉద్బోదించారు. నిన్నటి దాకా స్నేహ పూర్వకంగా ఉంటూ వచ్చామని ఇక నుంచి ఊరుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్(KCR).
ఇక మోదీతో ప్రత్యక్ష పోరాటం చేయడమే మిగిలి ఉందని ప్రకటించారు. కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకు వస్తామని, మోదీ మెడలు వంచుతామని హెచ్చరించారు సీఎం కేసీఆర్.
Also Read : ఊపిరి ఉన్నంత వరకు పొరాటమే