CM KCR Krishna : గొప్ప ఆత్మీయుడిని కోల్పోయాను – కేసీఆర్
కృష్ణ భౌతిక కాయానికి నివాళులు
CM KCR Krishna : సూపర్ స్టార్ కృష్ణ లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోతున్నా. నాకు అత్యంత ఆప్తుడు అంతకంటే ఎక్కువగా సహచరుడు నట శేఖరుడు కృష్ణ అని అన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR Krishna). ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచిన సూపర్ స్టార్ భౌతిక కాయానికి సీఎం నివాళులు అర్పించారు.
నానక్ రామ్ గూడలోని విజయ్ కృష్ణ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. అనంతరం నటులు నరేష్, మహేష్ బాబు కుటుంబీలను పరామర్శించారు. వారిని ఓదార్చారు. అనంతరం మీడియాతో సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలుగు సినిమా రంగం అంటేనే ఆనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజు నుంచి నేటి కృష్ణ దాకా అంతా ప్రభావితం చేసిన వాళ్లే. ప్రధానంగా నాకు చాలా ఆత్మీయులుగా ఉన్నారు.
రాజకీయాలలో కంటే వ్యక్తిగతంగా నాకు సుపరిచితులు అని పేర్కొన్నారు. ఆయన ఎన్నో సార్లు పిలిచారు. చాలా సార్లు వారు ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించానని చెప్పారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. కృష్ణ విలక్షణమైన నటుడు. పార్లమెంట్ సభ్యుడిగా దేశానికి, తన ప్రాంతానికి ఎనలేని కృషి చేశారని అన్నారు. సూపర్ స్టార్ అంటేనే అల్లూరి సీతారామరాజు గుర్తుకు వస్తుందన్నారు.
తాను అల్లూరు మూవీ గురించి చెప్పినప్పుడు మీరు కూడా సినిమాలు చూస్తారా అని తనను ప్రశ్నించారని గుర్తు చేశారు. ఆ సినిమా అంటే తనకు ఇష్టమని ఎన్నోసార్లు చూశానని చెప్పానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశించానని స్పష్టం చేశారు సీఎం.
Also Read : మన్నెం వీరుడి చిత్రం మరిచి పోలేం