President Election : ప్రెసిడెంట్ రేసులో కేసీఆర్..తమిళిసై..?
ప్రాంతీయ పార్టీల నుంచి సీఎం..బీజేపీ నుంచి గవర్నర్
President Election : భారత దేశ అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి. ఈ పదవిలో ఇప్పటి వరకు రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీ కాలం పూర్తవుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నికలకు(President Election) సంబంధించి ఈనెల 15న నోటిఫికేషన్ ప్రకటిస్తుంది.
జూలై 18న పోలింగ్ జరుగుతుంది. 21న ఫలితాన్ని ప్రకటిస్తారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ సంకీర్ణ (ఎన్డీఏ) సర్కార్ కు మ్యాజిక్ ఫిగర్ రావాలంటే ఇంకా 8 వేలకు పైగా ఓట్లు పొందాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఈ ఎన్నికల్లో విపక్షాలకు ఎక్కువ ఓట్లు ఉండడంతో ఈసారి రాష్ట్రపతి ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా కొత్తగా పేర్లు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఉప్పు నిప్పులాగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై ఉండడం విశేషం.
ప్రాంతీయ పార్టీల నుంచి కేసీఆర్ ను బరిలోకి దించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి శరద్ పవార్ తో పాటు
గులాం నబీ ఆజాద్ పేర్లు వినిపిస్తున్నాయి.
ఇక భారతీయ జనతా పార్టీలో ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఆ పార్టీ నుంచి ఇప్పటికే ఉపరాష్ట్రపతిగా ఉన్న ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు తమిళి సై సౌందర రాజన్ , రాజ్ నాథ్ సింగ్ తదితరుల పేర్లు ఉన్నాయి.
కాగా అటు అధికార పక్షానికి ఇటు విపక్షాలకు ఆమోద యోగ్యుడిగా ఉండే వ్యక్తులను ఎంపిక చేసే యోచనలో ప్రధాని మోదీ ఉన్నట్లు సమాచారం.
ఇంకా సమయం ఉండడంతో చివరగా ఎవరిని ఎంపిక చేస్తారనే ది ఉత్కంఠ నెలకొంది. రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఇద్దరు గవర్నర్ల
పేర్లను కూడా పరిశీలిస్తున్నట్లు టాక్. కాగా విపక్షాలన్నీ కలిసి సోనియా గాంధీ పవార్ ను సూచించినట్లు తెలిసింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇదిలా ఉండగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడుకు
చెందిన అన్నాడీఎంకే, నితీష్ కుమార్ , నవీన్ పట్నాయక్ రాష్ట్రపతి ఎన్నికల్లో(President Election) కీలకం కానున్నారు.
ఇక టీఆర్ఎస్ చీఫ్ , సీఎం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేశారు. ఆయన జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు
అఖిల భారత సమితి పేరుతో పార్టీ కూడా పెట్టనున్నట్లు సమాచారం.
Also Read : తెలంగాణకు ఏం చేసినవో చెప్పు – బండి