Arvind Kejriwal : ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 23న భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ వర్దంతి సందర్భంగా ఢిల్లీలో ప్రభుత్వ ఆధీనంలో సర్దార్ షహీద్ భగత్ సింగ్ పేరుతో ఆర్మ్ డ్ సైనిక్ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఢిల్లీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తోంది. సైనిక్ స్కూల్ ఆఫ్ ఢిల్లీ పేరును ఇక నుంచి షాహీద్ భగత్ సింగ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ స్కూల్ గా మార్చాలని నిర్ణయించింది.
ఈ విషయాన్ని ఢిల్లీ సీఎం ప్రకటించారు. షహీద్ ఎ ఆజం భగత్ సింగ్ బలిదానం అని పేర్కొన్నారు. సైన్యంలో చేరేందుకు పిల్లలకు శిక్షణ ఇచ్చే పాఠశాలను ఢిల్లీ లో ఏర్పాటు చేస్తామని గత ఏడాది ప్రకటించామని తెలిపారు.
ఈ పాఠశాల పూర్తిగా ఉచితమన్నారు. రెసిడెన్షియల్ గా ఉంటుందన్నారు. నిపుణులైన అధ్యాపకులు, ప్రత్యేకించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన రిటైర్డ్ అధికారులు శిక్షణ ఇస్తారన్నారు.
ఢిల్లీలో నివసించే పిల్లలు ఎవరైనా ఇక్కడ అడ్మిషన్ తీసుకోవచ్చని అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal )వెల్లడించారు. ఇందులో 9, 11వ తరగతిలో ప్రవేశం ఉంటుందన్నారు.
ఎన్డీఏ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సాయుధ దళాలలో చేరేందుకు విద్యార్థులకు శిక్షణ ఇస్తామన్నారు. విద్యతో పాటు హాస్టల్ వసతి కూడా ఉచితమేనని చెప్పారు సీఎం.
బాల, బాలికలకు ప్రత్యేక హాస్టల్స్ ఉంటాయని వెల్లడించారు. పాఠశాల క్యాంపస్ ఢిల్లీలోని ఝరోదా కలాన్ లో ఉంటుందన్నారు. 14 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంటుందన్నారు.
ఇప్పటి వరకు ఇందులో చేరేందుకు 18 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు.
Also Read : లాలూ ప్రసాద్ ఆరోగ్యం విషమం