CM Mamata Banerjee : తృణమూల్ కాంగ్రెస్ లో దిద్దుబాట్లు చేస్తున్న సీఎం

ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రస్ పార్టీ వెంటనే స్పందించింది...

CM Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యం వివాదాల్లోనే ఉంటారు. అందుకు గల్లీ స్థాయి నేత నుంచి ఆ పార్టీ అధినేత, సీఎం మమతా బెనర్జీ వరకు అందుకు ఏ ఒక్కరు మినహాయింపు కాదన్నది సుస్పష్టం. దీంతో కేంద్రంలోని అధికార పార్టీతో చురకలంటించుకోక తప్పని పరిస్థితి అయితే నెలకొంది. అలాంటి వేళ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ(CM Mamata Banerjee).. ముందు తన పార్టీని చక్కదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అందుకు అవునని చెప్పాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. తేజ్‌పుర్ బీచ్‌ సమీపంలోని అటవీ శాఖ భూమిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను ఫారెస్ట్ రేంజర్ మనీషా సాహు తొలగించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్‌పై జైళ్ల శాఖ మంత్రి అఖిల్ గిరి స్థానికుల సమక్షంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తీవ్రంగా హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ప్రతిపక్షాలు విమర్శలు ప్రారంభించాయి. అంతేకాకుండా అఖిల్ గిర్‌పై చర్యలు తీసుకోకుండా పార్టీ పరువు పోతుందంటూ.. సొంత పార్టీలోనే అసమ్మతి రేగింది.

CM Mamata Banerjee…

ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రస్ పార్టీ(TMC) వెంటనే స్పందించింది. మంత్రి పదవికి రాజీనామా చేసి, అటవీ శాఖ అధికారి మనీషా సాహుకు క్షమాపణ కోరాలని అఖిల్ గిరిని ఆదేశించాయి. తొలుత బెట్టు చేసిన.. ఆ తర్వాత దిగి వచ్చి రాజీనామా చేసేందుకు ఆయన సంసిద్దత వ్యక్తం చేశారు. అయితే మహిళా అధికారికి క్షమాపణలు మాత్రం చెప్పనని అఖిల్ గిరి కుండ బద్దలు కొట్టారు. తన రాజీనామా లేఖను తొలుత ఈ మెయిల్ ద్వారా పంపుతానని స్పష్టం చేశారు. అనంతరం సీఎం మమతాను కలిసి స్వయంగా తన రాజీనామా లేఖను సమర్పిస్తానని పేర్కొన్నారు. గతంలో ఇదే అఖిల్ గిరి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సైతం వివాదం రేగింది. దీంతో సాక్షాత్తూ పార్టీ చీఫ్, సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) రంగంలోకి దిగి క్షమాపణలు కోరిన సంగతి తెలిసిందే. బెంగాల్‌లోని రామ్‌నగర్ ఎమ్మెల్యేగా అఖిల్ గిరి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మరోవైపు లోక్‌సభ ఎన్నికల వేళ.. బెంగాల్‌లోని సందేశ్ కాలీ పరిసర ప్రాంతాల్లో చోటు చేసుకున్న దారుణాలు అన్ని ఇన్నీ కావు. వాటన్నింటిలో స్థానిక టీఎంసీ నేత షాజహన్ పేరు వైరల్ అయింది. అలాగే చోప్రా ప్రాంతంలో ఓ వివాహిత, యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడంటూ వారిద్దరిని నడి రోడ్డుపై టీఎంసీ నేత తాజుమ్ముల్ వెదురు కర్రతో చితక్కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అలాగే కోల్‌కతాలోని వార్డ్ మెంబర్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, తన సొంత పార్టీ కార్యకర్తపై దాడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో సైతం హల్ చల్ చేసింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో మమతా పార్టీపై తీవ్ర విమర్శలు అయితే ఎగసిపడ్డిన సంగతి తెలిసిందే.

Also Read : CPI Ramakrishna : ఏపీలో జరిగిన భూ అక్రమాలపై కీలక వ్యాఖ్యలు చేసిన సిపిఐ రామకృష్ణ

Leave A Reply

Your Email Id will not be published!