Prashant Kishor Nitish Kumar : సీఎం నితీశ్ ప్రశాంత్ కిశోర్ భేటీ
పీకే పట్ల ఎలాంటి కలత చెందలేదు
Prashant Kishor Nitish Kumar : ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టించిన భారతీయ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ , జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్(Prashant Kishor Nitish Kumar) మధ్య కొంత కాలం పాటు దూరం పెరిగింది.
ఒకానొక సమయంలో ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే జేడీయూలో చేరారు. ఆ తర్వాత గుడ్ బై చెప్పారు. ఆపై తాను ఇక పార్టీలతో పని చేయబోనంటూ ప్రకటించారు.
ఆ వెంటనే గత ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో పని చేశారు. సత్తా చాటారు. ఒక రకంగా చెప్పాలంటూ పీకే చెప్పిన మాటకు కట్టబడడు.
ఇక సీఎం నితీశ్ కుమార్ సైతం తాను ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదు. జేడీయూ చీఫ్ కు విలువలు, సిద్దాంతాల కంటే పదవి ముఖ్యం.
ఇక పీకే ఇప్పుడు మోస్ట్ పవర్ ఫుల్ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్. ఇదిలా ఉండగా బీహార్ లో గత 17 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీతో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకున్నారు నితీశ్ కుమార్.
ఆపై కాంగ్రెస్, ఆర్జేడీతో జత కట్టారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై ప్రశాంత్ కిషోర్ ఘాటుగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ట్విట్టర్ వేదికగా
వరుస ట్వీట్లతో మరింత దుమారం చెలరేగేలా చేశారు.
ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి(PM Modi) సవాల్ చేయకుండా సలాం చేస్తున్న ఫోటోలను పీకే షేర్ చేయడం కలకలం రేపింది. ఈ
తరుణంలో గురు, శిష్యుల మధ్య పొరపొచ్చాలకు తెర దించే ప్రయత్నం చేశారు.
ఈ మేరకు పీకే, నితీశ్ కుమార్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సమావేశం అనంతరం సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ గురించి తాను కలత చెందడం లేదన్నారు.
ఇద్దరూ 45 నిమిషాలకు పైగా మాట్లాడుకున్నారు. జనతాదళ్ యునైటెడ్ మాజీ నాయకుడు పవన్ వర్మ ఈ మీటింగ్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
Also Read : ఫడ్నవీస్ భార్యపై అనుచిత కామెంట్స్