CM Revanth Reddy : 28 నుంచి తెలంగాణలో గ్రామ సభలు
ప్రకటించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఈనెల 28 నుంచి వచ్చే జనవరి 6వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్బంగా కీలక అంశాలపై చర్చలు జరిపారు.
CM Revanth Reddy New Program
ఎన్నికల సందర్బంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే సర్కార్ ప్రతిష్టాత్మకంగా రెండు గ్యారెంటీలకు శ్రీకారం చుట్టిందన్నారు. గ్రామాలల్లో గ్రామ సభలు పట్టణాలు, నగరాలలో నగర, పట్టణ సభలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, మున్సిపల్ వార్డులలో అవసరమైన లబ్దిదారులను ఎంపిక చేయాల్సిన బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లపై ఉంటుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ సభలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించాలని తెలిపారు.
ఇందులో రేషన్ కార్డులు, ఆరోగ్య శ్రీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ది పొందేందుకు వీలు కల్పించేందుకు వీటిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
Also Read : KTR : ఆటో డ్రైవర్లకు కేటీఆర్ భరోసా