CM Revanth Reddy : తమ పాలనలోనైనా పాలమూరును అభివృద్ధి చేసుకోనివ్వండి

గ్రామగ్రామానికితండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదని తెలిపారు...

CM Revanth Reddy : పాలమూరు అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. తమ పాలనలోనైనా పాలమూరును అభివృద్ధి చేసుకోనివ్వండంటూ ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా సూచించారు. ఈ జిల్లా 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక సీఎంను ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పాలమూరు రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్‌‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరుకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు బిడ్డనై ఉండి.. ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే ప్రజలు తనను క్షమించరన్నారు. పాలమూరు ప్రజలు ఓట్లు వేస్తేనే కేసీఆర్ రెండు సార్లు సీఎం అయ్యారని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పాలమూరు యువతకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామన్నారు. తమ పరిశ్రమలో 2 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామని అమర్‌రాజా సంస్థ హామీ ఇచ్చిందని తెలిపారు.

CM Revanth Reddy Comment

గ్రామగ్రామానికితండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత తనదని తెలిపారు. బీటీ రోడ్ల నిర్మాణాలకు అంచనాలు తయారు చేయాలంటూ ఈ సందర్భంగా ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. పాలమూరుకు విద్య, వైద్యం, ఉపాధి కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు. అంతకుముందు చిన్న చింతకుంట మండలం అమ్మాపూర్‌లోని కురుమూర్తి స్వామిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ కురుమూర్తి ఆలయంలో మౌలిక సదుపాయాలు లేవని ఆయన పేర్కొన్నారు. అందుకే రూ.110 కోట్లతో ఘాట్ రోడ్ కారిడార్ నిర్మిస్తున్నామన్నారు. కురుమూర్తి ఆలయానికి ఏం కావాలో కలెక్టర్ నివేదిక ఇస్తే నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పేదల తిరుపతిగా కురుమూర్తి ఆలయాన్ని కొలుస్తారన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పాలమూరులో ప్రాజెక్టులు సైతం పూర్తి కాలేదన్నారు.

కేసీఆర్హయాంలో పాలమూరుకు పరిశ్రమలు, ప్రాజెక్టులు రాలేదని విమర్శించారు. పాలమూరులో ఇంకా వలసలు కొనసాగుతూనే ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మక్కల్, నారాయణ్ పేట్, కొడంగల్ ప్రాంతాలకు కృష్ణా జలాలు తీసుకు వస్తామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ వెంట మంత్రులు కోమటిరెడ్డి, రాజనర్సింహ తదితరులు ఉన్నారు.

Also Read : Minister Nara Lokesh : చేనేత మహిళలకు అండగా మంత్రి లోకేష్ ఆర్థిక సహకారం

Leave A Reply

Your Email Id will not be published!