CM Revanth Reddy : రేపు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇవ్వనున్నారు...
CM Revanth Reddy : రేపు ఉదయం 10 గంటలకు ప్రజా భవన్ లేదా సెక్రెటరీయేట్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు తదితరులు హాజరుకానున్నారు. లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ అమలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలపై బ్యాంకర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేయనున్నారు.
CM Revanth Reddy Meet
లక్ష రూపాయల లోపు రైతు రుణమాఫీ చేయనున్న నేపథ్యంలో అన్ని మండల కేంద్రాలలో ఉన్న రైతు వేదికల్లో రైతుల సమావేశాలు జరగనున్నాయి. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులనుద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సందేశం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలులో భాగంగా తొలి విడతగా రూ.లక్ష మేర రుణాలున్న రైతుల ఖాతాల్లో గురువారం నగదు జమ జరగనుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల వద్ద రుణమాఫీ లబ్ధిదారులతో కలిసి సంబురాలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read : CM Chandrababu Delhi : ఢిల్లీ అధికారిక నివాసం పూజలో పాల్గొన్న సీఎం చంద్రబాబు