CM Revanth Reddy : కాబోయే ముఖ్యమంత్రి కి తెలంగాణ ముఖ్యమంత్రి ఫోన్
భవిష్యత్తులోనూ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు...
CM Revanth Reddy : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించడంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసారు. ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన, హామీల సమస్య పరిష్కరించాలని చంద్రబాబును సీఎం రేవంత్ కోరారు.
CM Revanth Reddy Comment
భవిష్యత్తులోనూ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. ఇదిలావుండగా, కౌంటింగ్ రోజున టీడీపీ కూటమి భారీ మెజారిటీ సాధించడంతో తెలంగాణ సీఎం రేవంత్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి పిలిస్తే తప్పకుండా వెళ్తానని రేవంత్ అన్నారు.
Also Read : Israel-Gaza Attacks : గాజా స్కూల్లపై బాంబు దాడి చేసిన ఇజ్రాయెల్ బలగాలు