CM Revanth Reddy: నిమ్స్‌ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి !

నిమ్స్‌ వైద్యులను అభినందించిన సీఎం రేవంత్‌ రెడ్డి !

CM Revanth Reddy: ఛాతీలో బాణం దిగిన ఆదివాసీ యువకుడిని కాపాడిన నిమ్స్‌ వైద్యులను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా బాణాన్ని తొలగించడం అభినందనీయమని సీఎం రేవంత్ తన సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా కితాబిచ్చారు. ప్రజల్లో నిమ్స్‌ పై ఉన్న నమ్మకాన్ని డాక్టర్లు మరోసారి రుజువు చేశారన్నారు. భవిష్యత్‌ లో నిమ్స్‌ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలు విలవిల్లాడుతూ నరకయాతన అనుభవించిన సోది నంద (17) అనే గిరిజన గిరిజన యువకుడికి నిమ్స్‌ వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే.

CM Revanth Reddy Praises..

ఛత్తీస్‌ గఢ్‌ కి చెందిన సోదినందకు వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తూ బాణం గుచ్చుకుంది. సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్యలో దిగటంతో బాధితుడిని కుటుంబ సభ్యులు భద్రాచలం ఆస్పత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకి తీసుకువెళ్లారు. అయితే పరిస్థితి విషమించటంతో అక్కడి వైద్యులు హైదరాబాద్‌ నిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డా.అమరేశ్వర్‌రావు బృందం దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు.

Also Read : Jai Shah : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీసీసీఐ సెక్రటరీ జై షా

Leave A Reply

Your Email Id will not be published!