CM Revanth-KCR : మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ర్టంలో జనం కష్టాల పాలయ్యారని మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు అంటున్నారు....
CM Revanth : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దివంగత నేత జైపాల్ రెడ్డి వర్థంతి సందర్భంగా నిర్వహించిన సంస్మరణ సభలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జైపాల్‌రెడ్డి సేవలు కొనియాడారు. తాజా రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీల ప్రస్తావన కూడా తెచ్చారు. ఇదే వేదికగా బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి రారని కేటీఆర్ అంటారని.. కానీ మరుసటి రోజు పొద్దున్నే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారన్న విషయాన్ని రేవంత్(CM Revanth) గుర్తుచేశారు. వారిద్దరి మధ్య సయోధ్య లేదని విమర్శించారు.
తెలంగాణ రాష్ర్టంలో జనం కష్టాల పాలయ్యారని మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు అంటున్నారు.. కానీ నిజానికి కేసీఆర్ కుటుంబమే కష్టాల పాలయిందని చెప్పుకొచ్చారు. ఎన్నికలలో ఇచ్చిన ఆరు గారెంటీలు అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రుణ మాఫీ చేస్తామని చెప్పానని అలాగే రుణ మాఫీ చేశామని తెలిపారు. జూలై 31 లోపు లక్షన్నర రుణ మాఫీ చేస్తామని అన్నారు. ఆగస్టు 12లోపు రూ.2లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో తామంతా కలిసి తిరిగి కార్యకర్తలను, నాయకులుగా గెలిపించే బాధ్యత తీసుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth) పేర్కొన్నారు.
CM Revanth Reddy Slams
మరోవైపు.. దివంగత మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే వ్యక్తి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(CM Revanth) తెలిపారు. జైపాల్‌రెడ్డి వర్థంతి సందర్భంగా సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు ముఖ్యమంత్రి హాజరయ్యారు. జైపాల్‌రెడ్డి చిత్రపటానికి సీఎం నివాళులు అర్పించారు. ఓడినా, గెలిచినా జైపాల్‌రెడ్డి పార్టీని వీడలేదని ఉద్ఘాటించారు. ఆయన వల్లే పదవులకు గౌరవం వచ్చిందని వ్యాఖ్యానించారు. జైపాల్‌రెడ్డి విలువలు పాటించారు.. నేర్పించారని తెలిపారు. జైపాల్‌రెడ్డి శిష్యులం, అనుచరులమని గర్వంగా చెప్పుకుంటారని అన్నారు. 2014లో జైపాల్‌రెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదని గుర్తుచేశారు. ఆయనకి పదవుల వల్ల గౌరవం రాలేదని, జైపాల్‌రెడ్డి వల్లే పదవులకు గౌరవం వచ్చిందని చెప్పారు. కల్వకుర్తిని అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో చెప్పానని వివరించారు. కల్వకుర్తిలో 100 పడకల ఆస్పత్రి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆమనగల్లులో డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
‘‘నేను ఎంత ఎత్తుకు ఎదిగినా.. నల్లమల బిడ్డనే.. నా ఎదుగుదలకు దోహదం చేసిన కల్వకుర్తి, నల్లమలను ఎప్పటికీ మరచిపోలేను. జైపాల్ రెడ్డి గురించి మాట్లాడాలంటే చాలా ఆలోచించాలి.. వారి జీవితం.. సిద్ధాంతాలు చాలా ఆదర్శవంతం. జైపాల్ రెడ్డి అప్పటి స్పీకర్ మీరా కుమార్‌కు చెప్పి మూడ్ ఆఫ్ ది హౌస్‌తో తెలంగాణ ఏర్పాటు చేశారు. అప్పట్లో రాష్ట్రానికి ఎవరు సీఎం అవుతారో చెప్పనందున 2014లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పట్లో సీఎంగా జైపాల్ రెడ్డి పేరును ప్రకటించి ఉంటే తప్పక గెలిచేది. కానీ ఇప్పుడు కల్వకుర్తి మనిషిని సీఎంగా నేను వచ్చాను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
Also Read : USPC Aspirants Death : యూపీఎస్సీ విద్యార్థుల మరణం పై నిప్పులు చెరిగిన ఆప్ ఎంపీ స్వాతి మలివాల్