CM Revanth Reddy : రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో పనిచేస్తాం

హైదరాబాద్ దేశ రక్షణకు సంబంధించి కీలకమైన నగరం. తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉంది...

CM Revanth Reddy : రాజకీయాలకతీతంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాడార్ స్టేషన్ గా పూడూరు మండలంలో ఏర్పాటు చేసిన కేంద్రం నిలుస్తుందని సీఎం అన్నారు. వికారాబాద్ జిల్లా పూడురు మండలంలో భారత నేవీ ఏర్పాటు చేస్తోన్న రాడార్ స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాడార్ స్టేషన్ కు భూమిపూజ చేసిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. దేశ రక్షణలో తెలంగాణ భాగస్వామ్యం కీలకమన్నారు.

CM Revanth Reddy Comment

“హైదరాబాద్ దేశ రక్షణకు సంబంధించి కీలకమైన నగరం. తెలంగాణకు మూడు వైపులా సముద్రం ఉంది. ఇక్కడ వీఎల్ఎఫ్ నిర్మాణంతో సముద్ర ప్రాంతం నుంచి చొరబడే ముష్కరుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ స్టేషన్ తో అనర్థాలు జరుగుతాయని కొందరు అపోహలు కలిగించే ప్రయత్నం చేశారు. కానీ తమిళనాడులో 34 ఏళ్లుగా ఉంది. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దేశ రక్షణ కోసం రాజీపడొద్దనే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలు చేయం. కేంద్రంతో కలిసి నడుస్తాం. దేశ రక్షణ కోసం పెడుతున్న ప్రాజెక్టులపై రాజకీయం చేసేవారు పునరాలోచించుకోవాలి . రాడార్ స్టేషన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఉంటుంది. దేశభద్రత చాలా ముఖ్యం. రాడార్ స్టేషన్ పై కొందరు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. దేశ రక్షణకు సంబంధించిన విషయాన్ని కూడా రాజకీయం చేయడం తగదు. బీఆర్ఎస్ పదేళ్లు అబద్ధాలు చెప్పింది. ఇప్పుడు దేశ రక్షణకు సంబంధించిన అంశంలో కూడా బీఆర్ఎస్ నేతలు అవే అబద్దాలు చెబుతున్నారు” అని సీఎం రేవంత్ విమర్శించారు.

Also Read : AP High Court : గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నో 24 ను కొట్టివేసిన హైకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!