Yogi Adityanath : ఎవరీ బుల్డోజర్ బాబా అని అనుకుంటున్నారా. దేశంలో ఇప్పుడు ఏకైక పదం వినిపిస్తోంది యూపీలో. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బుల్డోజర్ బాబా పేరు మారుమ్రోగింది.
అవినీతి, అక్రమార్కుల గుండెల్లో నిద్ర పోయిన ఏకైక సీఎం. ఒకే ఒక్కడు యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). ఇటీవల యూపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించాడు.
భారతీయ జనతా పార్టీకి ఘనమైన విజయాన్ని సాధించి పెట్టాడు. నేరస్థుల గుండెల్లో గునపమయ్యాడు. గ్యాంగ్ స్టర్ లకు చుక్కలు చూపించాడు. రెండోసారి యూపీ చరిత్రలో యోగి సీఎంగా కొలువుతీరాడు.
ఈ తరుణంలో కొలువుతీరిన వెంటనే సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనం కలిగించింది.
అధికారిక పర్యటనల్లో భాగంగా మంత్రులైనా, ఉన్నతాధికారులైనా, అధికారులైనా సరే హోటళ్లలో బస చేయొద్దని ఆదేశించారు. అంతే కాదు ఎవరైనా సరే ప్రభుత్వ అతిథి గృహాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు సీఎం.
ఈ విషయం తన కేబినెట్ లోని మంత్రులకు కూడా వర్తిస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా బంధువులను ఎవరినీ వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించు కోవద్దని చెప్పారు.
గెస్ట్ హౌస్ లలో మకాం చేయడం అన్నది మంత్రులకే కాదు అందరి అధికారులకు కూడా వర్తిస్తుందని మరోసారి హెచ్చరించారు. ఎప్పటికప్పుడు పనులు పూర్తి చేయాలని, లంచ్ బ్రేక్ 30 నిమిషాలకంటే ఎక్కువ ఉండ కూడదన్నారు.
ఇదిలా ఉండగా సీఎం యోగి ఆదిత్యానాథ్ తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రత్యేకించి కేబినెట్ లో , అధికారుల్లో గుబులు రేపుతోంది.
Also Read : అణగారిన వర్గాల గొంతుక అంబేద్కర్