CM Yogi Adityanath : సర్కారు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన యూపీ సీఎం యోగి
కాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బాటలోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఒకరోజు అదనపు హాలిడేను ప్రకటిచింది...
CM Yogi : దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అక్టోబర్ 31వ తేదీన పండుగ సెలవు ఉండగా, అదనంగా నవంబర్ 1వ తేదీని కూడా హాలిడేగా ప్రకటించారు. నవంబర్ 2వ తేదీ శనివారం, 3వ తేదీ ఆదివారం కావడంతో ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజులు సెలవు దక్కినట్టు అవుతుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఉద్యోగులంతా తమ కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు పండుగ సంబరాల్లో పాలుపుంచుకునే అవకాశం కలుగుతుంది. దీపావళి పండుగ సందర్భంగా అదనంగా మరోరోజు సెలవు పొడిగించడంతో ప్రభుత్వ కార్యాలయాలు, సెకండరీ స్కూళ్లన్నీ నవంబర్ 1న మూతపడతాయి. ఈ ఏడాది దీపావళి వేడుకలు అక్టోబర్ 31వ తేదీన మొదలై నవంబర్ 1వ తేదీ సాయంత్రం వరకూ కొనసాగుతాయి.
CM Yogi Adityanath Comment
కాగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ బాటలోనే ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా ఒకరోజు అదనపు హాలిడేను ప్రకటిచింది. నవంబర్ 1న కూడా హాలిడే ప్రకటించడంతో శని, ఆదివారాలతో కలిసి నాలుగు రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ బ్రేక్ లభిస్తుంది.
Also Read : Arvind Kejriwal : మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులందరికీ శుభవార్త చెప్పిన కేజ్రీవాల్ సర్కార్