CM Yogi Bollywood : సినీ ప్ర‌ముఖుల‌తో సీఎం యోగి

స‌హ‌కారం అందిస్తామ‌ని వెల్ల‌డి

CM Yogi Bollywood : ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ సినీ రంగానికి కావాల్సినంత మేర స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు త‌మ‌కు యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేసి ఇవ్వాల‌ని సూచించారు. సీఎం మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. ఈ సంద‌ర్భంగా బాలీవుడ్ కు చెందిన ప్ర‌ముఖుల‌తో స‌మావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేయ‌డం విస్తు పోయేలా చేసింది. ఈ కీల‌క మీటింగ్ లో నిర్మాత బోనీ క‌పూర్ , గాయ‌కులు సోనూ నిగ‌మ్ , కైలాష్ ఖేర్ , న‌టుడు సునీల్ శెట్టి, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మ‌ధుర్ భండార్క‌ర్ , త‌దిత‌రులు పాల్గొన్నారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ ఇప్ప‌టికే దేశంలో ప‌ర్యాట‌క ప్రాంతంలో టాప్ లో ఉంద‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా సినిమాల‌కు అనుకూలంగా ఉండేలా ఏం చేయాలో సూచ‌న‌లు చేయాల‌ని కోరారు సీఎం యోగి ఆదిత్యానాథ్(CM Yogi Bollywood). యుపీని చ‌ల‌న చిత్ర అనుకూల రాష్ట్రంగా మార్చేలా చేసేందుకు తన వంతు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. త‌న రాష్ట్రాన్ని చ‌ల‌న చిత్ర నిర్మాణ గ‌మ్య స్థానంగా అన్వేషించేందుకు వినోద ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖులు రావాల‌ని కోరారు సీఎం.

స‌మాజాన్ని ఏకం చేయ‌డంలో , దేశ ఐక్య‌త‌, సార్వ భౌమ‌త్వాన్ని కాపాడడంలో సినిమా క‌ల‌క పాత్ర పోషిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు యోగి ఆదిత్యానాథ్. జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డులు, ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇంఇయా లో దీనికి గుర్తింపు ల‌భించింద‌న్నారు.

సుర‌క్షిత‌మైన వాతావ‌ర‌ణంతో పాటు ఉత్త‌రాది రాష్ట్రానికి మంచి క‌నెక్టివిటీ ఉంద‌న్నారు సీఎం. త‌మ ప్ర‌భుత్వ పాల‌సీ ప్ర‌కారం యూపీలో వెబ్ సీరీస్ చిత్రీక‌రిస్తే 50 శాతం స‌బ్సిడీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Also Read : ఆర్ట్ డైరెక్ట‌ర్ సునీల్ బాబు ఇక లేరు

Leave A Reply

Your Email Id will not be published!