Rahul Gandhi Yatra Comment : రాహుల్ ఆశా కిరణం కానున్నారా
పాదయాత్రతో పార్టీకి పూర్వ వైభవం
Rahul Gandhi Yatra Comment : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో బహుశా ఏ నాయకుడు లేదా ఏ నాయకురాలు ఎదుర్కోనన్ని విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు యువ నాయకుడు రాహుల్ గాంధీ.
తన తండ్రి మరణం తర్వాత కొంత గ్యాప్ ఏర్పడింది. ఆ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గాంధీ ఫ్యామిలీనా లేక గాంధీయేతర వ్యక్తులా అన్న చర్చ కొంత కాలం నుంచీ కొనసాగుతూనే వచ్చింది.
ఊహించని రీతిలో అచ్చేదిన్ అంటూ దేశ రాజకీయాలలో సరికొత్త నినాదంతో ముందుకు వచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆక్టోపస్ లా విస్తరించడంలోసక్సెస్ అయ్యింది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఒడిదుడుకులకు లోనవుతూ వచ్చిందో దగ్గరుండి చూస్తున్నారు ఆ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ.
ఆయనను ఓ వైపు కాషాయం ఇంకో వైపు అంతర్గతంగా పార్టీకి చెందిన వారే విమర్శలకు దిగడం కొంత ఇబ్బంది కలిగించింది.
ఓ వైపు తల్లికి అనారోగ్యం, మరో వైపు పార్టీలోనే కుమ్ములాటలు, ఎన్నికలు, సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటు రోజు రోజుకు ఎన్నికైన ప్రజా
ప్రతినిధులు గడప దాటడం కూడా రాహుల్ గాంధీ(Rahul Gandhi) కి సవాల్ గా మారింది.
ఇదే సమయంలో ఎక్కడికి వెళ్లినా దేశం గురించి ప్రస్తావిస్తూ వచ్చారు. ప్రజా సమస్యలను ఏకరువు పెడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, భారతీయ
జనతా పార్టీ, దాని అనుబంధ సంఘాలను , సంస్థలపై నిప్పులు చెరుగుతూ వచ్చారు.
ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదల ఆర్థిక స్థితిగతులు, దేశాన్ని ఎలా వ్యాపారవేత్తలకు అమ్ముతున్నారో నిలదీస్తూ వచ్చారు. త్వరలో 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి.
ఇప్పటి నుంచే రోడ్ మ్యాప్ సిద్దం చేశారు. ఇందు కోసం భారత్ జోడో యాత్ర(Rahul Gandhi Yatra) చేపట్టారు. ఆయన చేపట్టిన యాత్రకు పెద్ద ఎత్తున జనాదరణ లభిస్తోంది.
మతం, కులం, ప్రాంతం పేరుతో దేశాన్ని విభజన రాజకీయాలకు తెర తీసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తిప్పి కొట్టడంలో రాహుల్ గాంధీ సక్సెస్ అయ్యారు.
కొంత కాలం పాటు సందిగ్ధత స్థితిని ఎదుర్కొంటున్న పార్టీకి ఇప్పుడు యాత్రతో కొంత బలం చేకూరినట్లయింది. పాత తరం కొత్త తరం యువ తరం మధ్య ఉన్న గ్యాప్ ను పూరించేందుకు ప్రయత్నం చేస్తున్న తీరు కొంత మేరకు సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు.
ప్రచురణ, ప్రసార మాధ్యమాలన్నీ మోదీ జపం చేస్తున్నా సోషల్ మీడియాలో మాత్రం రాహుల్ గాంధీ పేరు మారుమ్రోగుతోంది. ప్రస్తుతం ఆయన దేశానికి
ఆపద్బాంధువుడిగా, దైవ దూతగా కనిపిస్తున్నారు.
ఇందులో ఆశ్చర్య పడాల్సిన పని లేదు. ఈడీ విచారణ సందర్భంగా కొన్ని గంటల పాటు విచారించిన అధికారులు రాహుల్ గాంధీ సంయమనాన్ని చూసి విస్తు పోయారు.
ఏది ఏమైనా రాహుల్ గాంధీ ఇప్పుడు దేశానికి ఆశాకిరణం లాగా కనిపిస్తున్నారు. ఏ మేరకు సక్సెస్ అవుతారనే దానిపై కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : రాజస్థాన్ బాటలో చత్తీస్ గఢ్ కాంగ్రెస్