Telugu States : తెలుగు రాష్ట్రాలపై పంజా విసురుతున్న చలి పులి
Telugu States : తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇరు రాష్ట్రాలలో శీత ప్రాంతాలుగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్, తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాలలోని
తెలుగు రాష్ట్రాలపై చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతూనే ఉన్నాయి. ప్రధానంగా ఇరు రాష్ట్రాలలో శీత ప్రాంతాలుగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్, తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లాలలోని మన్నెం ప్రాంతాలు మంచు విపరీతంగా కురుస్తుండటంతో ఈ ప్రాంతాలలో ఆహ్లాద భరిత వాతావరణాన్ని కనులారా వీక్షించి పరవసించేందుకు పర్యాటకులు వచ్చేస్తుండటం కనిపిస్తోంది. ఇక ఇరు రాష్ట్రాలలో పలు ప్రాంతాలలో గత రెండు రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల వివరాలు చూస్తే…
కొమురంభీమ్ జిల్లా గిన్నెదరిలో 4.3 కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. తాంసిలో 4.9, అర్లి(టీ)లో 4.6, బేలా, మొమిన్‌పేటలో 5.0, కోహిర్ 5.1, సొనాలలో 5.3, నేరడిగొండలో 5.4, అల్గోల్, జైనాథ్‌లో 5.6, మార్‌పల్లెలో 5.7 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇక సిర్పూర్ (యు), బరంపూర్, డోంగ్లీ, అదిలాబాద్ అర్బన్‌లో 6.0, భోరజ్‌లో 6.1, పెంబి, నల్లవల్లిలో 6.2, నర్సాపూర్, కేరమెర్రిలో 6.4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
చింతపల్లి, లంబసింగిలో 6.5, మినుములూరులో 8, అరకు, పాడేరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి చల్లనిగాలులు వీస్తుండడంతో పిల్లలు, వృద్ధులు, రోడ్లపై నుంచి వెళ్తున్న వాహనదారులు చలికి వణికిపోతున్నారు. మంచుకారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక హైదరాబాద్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల రహదారులు కనిపించనంతగా ఉదయం పూట మంచు తెరలు కప్పేస్తుండటంతో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
No comment allowed please