Imran Khan : దేశం కోసం మళ్లీ వస్తున్నా – ఇమ్రాన్ ఖాన్
కాల్పులు జరిగిన చోటే మరోసారి ర్యాలీ
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ చాలా మందికి ప్రధానమంత్రిగా కంటే పాకిస్తాన్ క్రికెట్ జట్టు క్రికెటర్ గా ఎక్కువగా తెలుసు. అంతలా పాపులర్ అయ్యాడు. అసలైన నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అట్టడుగున ఉన్న పాకిస్తాన్ జట్టును సక్సెస్ చేశాడు. 1992లో ఆ దేశానికి ప్రపంచ కప్ ను తీసుకు వచ్చాడు.
ఇదే సమయంలో రిటైర్మెంట్ ప్రకటించాక దేశం అతడిని హీరోగా చూసింది. ఆపై భారీ మెజారిటీ కట్టబెట్టింది. ఆయన స్థాపించిన పీటీఐకి జనం బ్రహ్మరథం పట్టారు. ఆపై ప్రధానమంత్రిగా కొలువు తీరిన ఇమ్రాన్ ఖాన్ ఏదో చేయాలని అనుకున్నారు. అవినీతి రహిత పాకిస్తాన్ గా మారుస్తానని ప్రకటించాడు.
కానీ వర్కవుట్ కాలేదు. ఆపై ఆర్మీ , అమెరికా, ప్రతిపక్షాలు పన్నిన వ్యూహంలో చిక్కుకున్నాడు. క్రికెట్ లో తన అద్భుతమైన బంతులతో వికెట్లను కూల్చిన ఈ బౌలర్ రాజకీయ చదరంగపు ఆటలో కనీసం ప్రభావం చూపించ లేక పోయాడు. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించబడిన ఏకైక ప్రధానిగా మిగిలి పోయాడు ఇమ్రాన్ ఖాన్(Imran Khan).
తనను దించడంలో అమెరికా పాత్ర ఉందన్నాడు. మొదట భారత్ తో కయ్యం పెట్టుకోవాలని చూశాడు. చివరకు ఆయన స్వరం నుంచే భారత విదేశాంగ విధానం గొప్పదన్నాడు. అంతే కాదు పాక్ ఆర్మీ కంటే భారత్ ఆర్మీ బలమైనదని పేర్కొన్నాడు. మరోసారి తన సత్తా ఏమిటో ప్రజల వద్దకు వెళతానంటూ ర్యాలీలు, సభలతో ముందుకు వెళుతున్నాడు ఇమ్రాన్ ఖాన్.
కానీ నవంబర్ 3న ఆయన కాల్పులకు గురయ్యాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇదిలా ఉండగా అక్కడి నుంచే తిరిగి వస్తానంటూ ప్రకటించాడు. పీటీఐ ఈ మేరకు ఖాన్ మళ్లీ వస్తున్నాడంటూ డిక్లేర్ చేసింది.
Also Read : టి20 వరల్డ్ కప్ మాదే – పాక్ కోచ్