Rahul Gandhi : మోదీ పాలనలో కమీషన్..కరప్షన్ – రాహుల్
మరోసారి నిప్పులు చెరిగిన అగ్ర నేత
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతోంది. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ప్రారంభించిన ఈ యాత్రకు అపూర్వమైన రీతిలో స్పందన లభిస్తోంది.
శనివారం ఏపీలో కొనసాగుతున్న పాదయాత్రలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై మండిపడ్డారు. ప్రధానంగా కర్ణాటక ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కమీషన్, కరప్షన్ అన్నది లీగలైజ్ గా మారి పోయిందని సంచలన ఆరోపణలు చేశారు.
ప్రతి దానికి కమీషన్ చెల్లించకుండా పనులు కావడం లేదని ఇలాంటి వ్యవస్థను పెంచి పోషిస్తున్న ఘనత బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.
40 శాతం కమీషన్ ఇస్తేనే పనులు మంజూరు చేస్తున్నారంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). ఇక దేశంలో ఓ వైపు ద్రవ్యోల్బణం ఇంకో వైపు నిరుద్యోగం పెరుగుతున్నా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రధాన మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఈ దేశంలో ఉందో లేదో తెలియడం లేదంటూ నిర్మలా సీతారామన్ పై సెటైర్లు వేశారు రాహుల్ గాంధీ. ఇక వరల్డ్ హంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం మరింత దిగజారిందని గత ఏడాది 101వ స్థానంలో ఉంటే ఈసారి 107కి పడి పోయిందన్నారు.
దీనికంతటికీ ప్రధాన కారణం నరేంద్ర మోదీనేనంటూ ఆరోపించారు రాహుల్ గాంధీ. డబుల్ ఇంజిన్ బీజేపీ ప్రభుత్వానికి ఇంధనం తగ్గుతోందన్నారు. డాలర్ బలపడడం వల్లనే రూపాయి క్షీణిస్తోందంటూ ఆర్థిక మంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు.
Also Read : అందరి కళ్లు ట్రబుల్ షూటర్ పైనే