Team India : ‘గ‌బ్బా’ విజ‌యానికి ఏడాది పూర్తి 

ఆసిస్ పై భార‌త్ గ్రాండ్ విక్ట‌రీ 

Team India : అన్ని ఫార్మాట్ ల‌లో బ‌ల‌మైన ఆస్ట్రేలియాను ఆ దేశంలో ఓడించి టెస్టు సీరీస్ గెలిచి చ‌రిత్ర సృష్టించింది భార‌త జ‌ట్టు. గ‌బ్బా వేదిక‌గా ఆసిస్ పై గెలిచి స‌రిగ్గా ఈ రోజుతో ఏడాది పూర్త‌వుతుంది.

ఆనాటి జ్ఞాప‌కం ఇంకా మెదులుతూనే ఉంది. గ‌బ్బా స్టేడియం వేదిక‌గా జ‌రిగిన టెస్టు మ్యాచ్ లో భార‌త్ (Team India)బ‌ల‌వంత‌మైన ఆస్ట్రేలియాను మ‌ట్టి క‌రిపించింది. 2-1 తేడాతో సీరీస్ కైవ‌సం చేసుకుంది.

అత్యంత చరిత్రాత్మ‌క విజ‌యాల‌లో ఇది కూడా ఒక‌టిగా పేర్కొంది భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి – బీసీసీఐ. ఈ మేర‌కు ఆనాటి అరుదైన విజ‌యోత్స వ సంబురాలతో కూడిన క్ష‌ణాల‌ను మ‌ళ్లీ గుర్తుకు వ‌చ్చేలా చేసింది.

ఈ మేర‌కు ఆనాటి గెలుపున‌కు సంబంధించి వీడియోను కూడా షేర్ చేసింది. స‌రిగ్గా ఇవాల్టితో అంటే గ‌త ఏడాది 2021 జ‌న‌వ‌రి 19న ఈ గెలుపు భార‌త్ వశ‌మైంది. నేటితో ఏడాది పూర్తి చేసుకోవ‌డంతో బీసీసీఐ అరుదైన ఫోటోను జ‌త చేసింది.

మూడు వికెట్ల తేడాతో ఓడించి అరుదైన ఘ‌న‌త‌ను సాధించిందంటూ పేర్కొంది. ఈ టెస్టు సీరీస్ అత్యంత చిర‌స్మ‌ర‌ణీయ‌మైన‌ది. ఆస్ట్రేలియాలో భార‌త్ వ‌రుస‌గా రెండోసారి ఆసిస్ ను ఓడించంది.

అడిలైడ్ ఓవ‌ల్ లో 8 వికెట్ల తేడాతో భార‌త్ ప‌రాజ‌యం పాలైన త‌ర్వాత మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జ‌రిగిన బాక్సింగ్ డే టెస్టులో భార‌త్ అదే తేడాతో విజ‌యం సాధించేందుకు పోరాడింద‌ని తెలిపింది బీసీసీఐ.

సిడ్నీ టెస్టులో మూడో టెస్టు హోరా హోరీగా సాగింది. కానీ డ్రాగా ముగిసింది. విహారి, అశ్విన్ లు అడ్డుకున్నారు. ఓడిపోకుండా కాపాడారు. రెండో ఇన్నింగ్స్ లో పంత్ 89 ప‌రుగులు చేసి భార‌త జ‌ట్టు(Team India) విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు.

Also Read : టెస్టు కెప్టెన్సీకి ఆ ఇద్ద‌రైతే బెట‌ర్

Leave A Reply

Your Email Id will not be published!