MK Stalin : సీఎం స్టాలిన్ పాల‌న‌కు ఏడాది పూర్తి

5 కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేసిన డీఎంకే చీఫ్

MK Stalin : డీఎంకే చీఫ్ , త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ కొలువు తీరి ఇవాల్టితో ఏడాది పూర్త‌యింది. ఆయ‌న ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా టోల్ ఫ్రీ నెంబ‌ర్ ఏర్పాటు చేశారు. పార‌ద‌ర్శ‌క పాల‌న‌కు తెర తీశారు.

అవినీతి, అక్ర‌మాల‌కు తావు లేకుండా చేశారు. అంతే కాదు అసెంబ్లీలో ఖ‌ర్చుల‌ను త‌గ్గించారు. శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణ‌లో క్యాంటీన్ లో మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు వాడ కూడద‌ని కోరారు.

త‌మ భోజ‌నాన్ని తామే ఇంటి నుంచి తీసుకు రావాల‌ని కోరారు. తన వెంట ఉన్న భారీ సెక్యూరిటీని త‌గ్గించారు. అంబులెన్స్ ల‌కు ఎవ‌రైనా స‌రే దారి ఇవ్వాల్సిందేన‌ని ఆదేశించారు.

ఆయ‌న త‌న పాల‌న‌ను ప్ర‌జల కోస‌మేన‌ని చేత‌ల‌లో చూపిస్తున్నారు. తాజాగా సీఎం ఎంకే స్టాలిన్(MK Stalin) పాల‌న సంవ‌త్స‌రం పూర్త‌యిన సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకుని కీల‌క ప్ర‌కట‌న చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు అందించారు.

శనివారం ఐదు భారీ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం సంచల‌నం క‌లిగించింది. ఒక‌టి నుంచి 5 త‌ర‌గ‌తుల ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల విద్యార్థుల‌కు అల్పాహార ప‌థ‌కం, శ్రేష్ట పాఠ‌శాలలు, బ‌డి పిల్ల‌ల‌కు వైద్య ప‌రీక్ష‌లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో పీహెచ్ సీ ( ప్ర‌జా ఆరోగ్య కేంద్రం) త‌ర‌మా కేంద్రాలు, అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌లో మీ నియోజ‌క‌వ‌ర్గంలో సీఎం కార్య‌క్ర‌మాల‌ను వెల్ల‌డించారు.

ఈ కొత్త కార్య‌క్ర‌మాల‌ను అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించారు. ఎన్నిక‌ల సంద‌ర్బంగా తాము ఇచ్చిన హ‌మీల‌లో చాలా వాటికి నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు ఎంకే స్టాలిన్.

Also Read : కేజ్రీవాల్ సారీ చెప్పే వ‌ర‌కు పోరాడుతా

Leave A Reply

Your Email Id will not be published!