Asaduddin Owaisi : అవినీతిలో కాంగ్రెస్ , బీజేపీ ఒక్కటే
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ
Asaduddin Owaisi : ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్ చేశారు. అవినీతిలో కాంగ్రెస్ , బీజేపీ రెండూ ఒక్కటేనని ఆరోపించారు. ఒకే నాణానికి రెండు వైపులా పని చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
మంగళవారం రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక రోజు నిరాహారదీక్ష చేపట్టనున్నారు. దీనిని ప్రత్యేకంగా ప్రస్తావించారు ఓవైసీ(Asaduddin Owaisi) . రెండు పార్టీలు ప్రజలతో నాటకాలు ఆడుతున్నాయంటూ మండిపడ్డారు.
ఎవరిని మోసం చేసేందుకు మీరు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారంటూ ప్రశ్నించారు ఓవైసీ. గతంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై ఎందుకు ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చర్యలు తీసుకోలేదంటూ నిలదీశారు. దీని బట్టి చూస్తే ఇరు పార్టీలు ఒక అవగాహనకు వచ్చినట్లు అర్థం అవుతుందని పేర్కొన్నారు.
దేశంలో ఏ పార్టీ పవర్ లోకి వచ్చినా అవినీతి అక్రమాలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు అసదుద్దీన్ ఓవైసీ. స్వంత సర్కార్ పై దీక్ష చేపడతానంటూ ప్రకటించడం ప్రజలకు ఏ సందేశాన్ని ఇవ్వదల్చు కున్నారంటూ మండిపడ్డారు ఎంపీ. మొత్తంగా అవినీతిని ఎదుర్కోవడంలో ఏ పార్టీ కూడా సీరియస్ గా లేదని దీన్ని బట్టి తెలుస్తోందన్నారు.
Also Read : అమృత పాల్ సింగ్ అనుచరుడు అరెస్ట్