Congress Campaign : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జూలు విదిల్చేందుకు సిద్దమైంది. తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగిరేసింది.
కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్న పంజాబ్ అధికారాన్ని అప్పనంగా ఆప్ కు అప్పగించింది. దీంతో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నేతృత్వంలోని జీ23 అసమ్మతి గ్రూప్ సోనియా గాంధీ నాయకత్వంపై (Congress Campaign)యుద్దం ప్రకటించారు.
గాంధీ ఫ్యామిలీ తప్పు కోవాలంటూ గళం వినిపించారు. తీరా ఆజాద్ మెత్త పడ్డారు. అసమ్మతి నేతలకు ముఖ్యమైన పదవులు కట్టబెట్టేందుకు మేడం అంగీకరించడం విశేషం.
ఇక ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ వ్యూహ రచనకు దిగింది. మోదీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ ధరలను పెంచడాన్ని, ప్రభుత్వ ఆస్తులను అమ్మడాన్ని తీవ్రంగా నిరసించింది.
అన్ని పార్టీల కంటే ఎండగట్టడంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Congress Campaign)ముందంజలో ఉన్నారు. ధరలు పెంచడంపై జంగు సైరన్ మోగించింది. మూడెంచల ఆందోళనలకు శ్రీకారం చుట్టింది.
తొలి దశలో ఈనెల 31న ఆందోళనలు, సిలిండర్లకు పూలదండలు వేస్తారు. డప్పులు, గంటలు మోగిస్తారు. ఏప్రిల్ 7 దాకా దేశమంతటా ఆందోళనలు, ర్యాలీలు చేపడతారు.
స్వచ్చంధ సంస్థలు, సామాజిక, మత సంస్థలు, సంక్షేమ సంఘాలతో కలిసి జిల్లా స్థాయిలలో ధర్నాలు చేపడతారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ నూర్జే వాలా వెల్లడించారు.
ప్రభుత్వ సంస్థలను గంప గుత్తగా అమ్మకానికి పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.
Also Read : ఎంత మంది పండిట్లను తరలించారు