Congress Chief Comment : కౌన్ బ‌నేగా కాంగ్రెస్ చీఫ్

అంద‌రి క‌ళ్లు శ‌శి థ‌రూర్ పైనే

Congress Chief Comment :  రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి. సుదీర్ఘ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి ఎవ‌రు అధ్య‌క్షుడు(Congress Chief)  అవుతార‌నేది త్వ‌ర‌లో తేల‌నుంది. మిగిలింది ఇద్ద‌రే అయినా వెనుక ఉండి న‌డుపుతున్న‌ది , న‌డిపిస్తున్న‌ది ఎవ‌ర‌నేది ఎవ‌రికీ అంతు చిక్క‌ని ప్ర‌శ్నగా మారింది. రాబోయే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఈ ఎన్నిక ఒక స‌వాల్ లాంటిది.

ప్ర‌జాస్వామ్యానికి తమ పార్టీ ప్ర‌తీక అని ప‌దే ప‌దే చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఆ పార్టీ చీఫ్(Congress Chief Comment) పోస్ట్ కీల‌కంగా మారింది. సంప్ర‌దాయానికి ఆధునిక‌త‌కు మ‌ధ్య పోరు న‌డుస్తోంది. గాంధీ కుటుంబం నుంచి మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే బ‌రిలో ఉండ‌గా జి23 టీంలో ఒక‌డిగా

ముద్ర ప‌డిన తిరువ‌నంత‌పురం ఎంపీ , ర‌చ‌యిత శ‌శి థ‌రూర్ పోటీలో నిలిచారు.

ఇద్ద‌రూ ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోక పోయినా శ‌శి థ‌రూర్ మాత్రం త‌న‌దైన స్టైల్ లో ప్ర‌చారాన్ని చేప‌డుతూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. తాను పోటీ చేసే కంటే ముందే సోనియా గాంధీని క‌లిశారు. త‌న నిర్ణ‌యాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు. ఇదే స‌మ‌యంలో అన్ని రాష్ట్రాల‌ను జ‌ల్లెడ ప‌డుతున్నారు.

ఇక ఎవ‌రు పార్టీ చీఫ్ గా ఎన్నికైనా రిమోట్ కంట్రోల్ మాత్రం గాంధీ ఫ్యామిలీ ( సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ) చేతుల్లోనే ఉంటుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని కొట్టి పారేశారు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే. తాను కీలు బొమ్మ‌ను కాన‌ని కింగ్ మేక‌ర్ న‌ని చెబుతున్నారు.

ఇక శ‌శి థ‌రూర్ మాత్రం త‌న‌దైన స్టైల్ లో ఇప్ప‌టికే మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. హైక‌మాండ్ రూలింగ్ కు మంగ‌ళం పాడ‌తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇది

క‌ల‌క‌లం రేపింది. మొత్తం 9,000 వేల మంది స‌భ్యులు ఉన్నారు. వీరిలో ఎవ‌రు ఎటు వైపు మొగ్గు చూపుతార‌నేది ఇంకా ప్ర‌శ్నార్థకంగా మారింది.

ఎంత‌గా పైకి గాంభీర్యాన్ని ప్ర‌ద‌ర్శించినా సోనియా చ‌ల్ల‌ని చూపు ఎవ‌రిపై ఉంటే వారే కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నిక త‌ప్ప‌దు. అంత‌కు ముందు రాజ‌స్థాన్ 

సీఎం అశోక్ గెహ్లాట్, మాజీ సీఎంలు క‌మ‌ల్ నాథ్ , దిగ్విజ‌య్ సింగ్ తో పాటు ముకుల్ వాస్నిక్ పేర్లు కూడా వినిపించాయి. 

కానీ ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కొత్త పేరు తెర‌పైకి తీసుకు వ‌చ్చారు సోనియా గాంధీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి ఎన‌లేని డిమాండ్.అంత‌కు 

మించిన గౌర‌వం కూడా. కానీ ఇప్పుడు ఆ పోస్ట్ గాంధీ ఫ్యామిలీ వ‌ర్సెస్ గాంధీయేత‌ర వ్య‌క్తుల మ‌ధ్య పోరాటంగా మారి పోయంది.

మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే సోనియా ఫ్యామిలీకి వీర విధేయుడిగా ముద్ర ప‌డ్డారు. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో పార్టీకి జ‌వ‌స‌త్వాలు తిరిగి తీసుకు వ‌చ్చే ప‌టిమ‌, 

ఉత్సుక‌త శ‌శి థ‌రూర్ కు ఉంది. శ‌శి థ‌రూర్ భార‌త దేశం ప‌ట్ల స‌మ‌గ్ర‌మైన అవ‌గాహ‌న ఉన్న నాయ‌కుడు. ఆధునిక‌త భావాలు క‌లిగిన వ్య‌క్తి. ఎవ‌రు ఎవ‌రిని ఆహ్వానిస్తారు ఎవ‌రికి ఓటు వేస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఏది ఏమైనా అక్టోబ‌ర్ 19న తేలుతుంది పార్టీకి కింగ్ మేక‌ర్ ఎవ‌ర‌నేది.

 

Also Read : గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్ వెనుక మ‌సూద్ భాయ్

Leave A Reply

Your Email Id will not be published!