Congress Comment : హామీల వ‌ర్షం ద‌క్క‌నుందా అధికారం

స‌భ స‌క్సెస్ నేత‌ల విభేదాల మాటేంటి

Congress Comment : తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. ఇదే స‌మ‌యంలో ఆ పార్టీ ఖ‌మ్మంలో నిర్వ‌హించిన జ‌న గ‌ర్జ‌న స‌భ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. ఇక రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై కాంగ్రెస్ పార్టీ స్టేట్ చీఫ్ రేవంత్ రెడ్డి నిత్యం యుద్దం చేస్తున్నారు. ప‌రుగులు పెట్టిస్తున్నారు. గ‌తంలో తమ పార్టీ తెలంగాణ ఇస్తే ఇప్ప‌టి వ‌ర‌కు 5 ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేశాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఆపై సీనియ‌ర్ నేత‌లు ఎవ‌రికి వారే య‌మునా తీరే అన్నంత‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఒకింత పార్టీ శ్రేణుల‌ను విస్మ‌యానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో 119 అసెంబ్లీ సీట్ల‌కు గాను ప‌వ‌ర్ లోకి రావాలంటే క‌నీసం 60 సీట్ల‌కు పైగా ద‌క్కించు కోవాల్సి ఉంటుంది. ముందు ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌లిగించాల్సిన బాధ్య‌త కాంగ్రెస్ పార్టీపై ఉంది. మ‌రో వైపు బీజేపీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్(Congress) కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు ఓటు వేసిన‌ట్లేన‌ని. ఎందుకంటే 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో, తిరిగి 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో సైతం గెలుపొందిన వారిలో కొంత మంది ఎమ్మెల్యేలు త‌ప్పా మిగ‌తా వాళ్లంతా జంప్ అయ్యారు. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా మాట‌లు చెప్పినా వీళ్లంతా ప‌ద‌వుల కోసం గ‌డ‌ప దాటుతార‌న్న ప్ర‌చారం జ‌రిగింది.

జీహెచ్ఎంసీ ఎన్నిక‌లతో పాటు హుజూరాబాద్ , మునుగోడులో పార్టీ ప‌రువు పోయింది. మ‌రో వైపు పార్టీలోనే నేత‌లు పార్టీ చీఫ్ పై ఆరోప‌ణ‌లు చేయ‌డం, మీడియాకు ఎక్క‌డం ప‌రిపాటిగా మారింది. కొంద‌రు పార్టీని వీడారు. మ‌రికొంద‌రు వేచి చూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్(Congress) పార్టీకి ఆక్సిజ‌న్ ఇచ్చేలా చేసింది పొరుగున ఉన్న క‌ర్ఱాట‌క‌. అక్క‌డ కొలువు తీర‌న భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌భుత్వం కూలి పోయింది. ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. కేపీసీసీ చీఫ్ గా ఉన్న డీకే శివ‌కుమార్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించాడు. పార్టీని కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా బ‌లోపేతం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. 224 సీట్ల‌కు గాను 135 సీట్లు తీసుకు వ‌చ్చేలా చేశాడు. ఇక పార్టీ హై క‌మాండ్ తెలంగాణ‌లో కర్ణాట‌క ఫార్ములా ను అమ‌లు చేయాల‌ని చూస్తోంది. దీనిపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర పార్టీకి జీవం పోసేలా చేసింది.

మ‌రో వైపు సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క చేప‌ట్టిన పీపుల్స్ మార్చ్ యాత్ర కీల‌కంగా మారింది. పార్టీకి అద‌న‌పు బ‌లాన్ని చేకూర్చేలా చేసింది. ఇదే స‌మ‌యంలో చేప‌ట్టిన జ‌న గ‌ర్జ‌న స‌భ‌లో నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు వేదిక‌పై క‌నిపించేలా చేసింది. పార్టీ ప‌రంగా గ్యారెంటీ హామీలు ప‌వ‌ర్ లోకి వ‌చ్చేల చేశాయ‌ని , ఎడా పెడా పార్టీ హామీలు గుప్పిస్తోంది. ఇందులో రూ. 4 వేల పెన్ష‌న్ సౌక‌ర్యం. మొత్తంగా కురిపిస్తున్న హామీల వ‌ర్షం ఏ మేర‌కు అధికారం లోకి వ‌చ్చేలా చేస్తాయో వేచి చూడాల్సి ఉంది. తామంతా ఒక్క‌టేన‌ని చెప్ప‌నంత వ‌ర‌కు జ‌నం న‌మ్మ‌ర‌ని తెలుసుకోవాలి. లేక పోతే కాంగ్రెస్ కు క‌ష్ట కాలం అని చెప్ప‌క త‌ప్ప‌దు. అవ‌త‌ల ఉన్న‌ది మామూలు మ‌నిషి కాదు. అపార‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడు కేసీఆర్. ముందు కోవ‌ర్టులు ఎవ‌రో గుర్తించి , ఒకే తాటిపైకి వ‌స్తేనే పార్టీ బ‌తుకుతుంది. అధికారంలోకి వ‌స్తుంది.

Also Read : Eatala Rajender : బండితో విభేదాలు లేవు – ఈట‌ల

 

Leave A Reply

Your Email Id will not be published!