Congress Task Force : కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ 2024 డిక్లేర్
ఇద్దరు కాంగ్రెస్ రెబల్స్ కు చోటు
Congress Task Force : కాంగ్రెస పార్టీ రాబోయే ఎన్నికలకు సన్నద్దం అయ్యేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. గుజరాత్ లోని ఉదయ్ పూర్ లో 12 నుంచి 13 వరకు నవ సంకల్ప్ చింతిన్ శివిర్ నిర్వహించింది.
ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో సత్తా చాటేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో ప్రధానమైనది కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్(Congress Task Force). మంగళవారం కీలక ప్రకటన చేసింది ఏఐసీసీ. రాజకీయ వ్యవహారాల బృందాన్ని ప్రకటించింది.
ఇందులో రాహుల్ గాంధీతో పాటు ఇద్దరు కీలక అసమ్మతివాదులుగా ముద్ర పడిన గులాం నబీ ఆజాద్ , ఆనంద్ శర్మ ఉన్నారు.
విచిత్రం ఏమిటంటే ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో కలిసి పని చేయక పోవడంతో ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న సునీల్ కానుగోలుకు కీలక పదవి లభించింది.
ఇందుకు సంభందించి పార్టీ ఎన్నికల నిర్వహణకు ఎంపికయ్యారు. వరుసగా ఎన్నికల పరాజయం తర్వాత చింతన్ శివిర్ లో రెండు ప్యానెళ్లను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది.
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని పొలిటికల్ అఫైర్స్ గ్రూప్ లో మల్లికార్జున్ ఖర్గే, అంబికా సోనీ, దిగ్విజయ్ సింగ్ , కేసీ వేణుగోపాల్ , జితేంద్ర సింగ్ ఉన్నారు.
టాస్క్ ఫోర్స్ లో పి. చిదంబరం, ప్రియాంక గాంధీ వాద్రా, ముకుల్ వాస్నిక్ , జైరాం రమేష్ , కేసీ వేణుగోపాల్ , అజయ్ మాకెన్ , రణదీప్ సూర్జేవాలా ను ఎంపిక చేశారు.
టాస్క్ ఫోర్స్(Congress Task Force) లోని ప్రతి సభ్యునికి సంస్థ, కమ్యూనికేషన్ , మీడియా , ఔట్ రీచ్, ఫైనాన్స్ , ఎన్నికల నిర్వహణకు సంబంధంచిన నిర్దిష్ట పనులు కేటాయిస్తారని కాంగ్రెస్ తెలిపింది.
Also Read : ఢిల్లీ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనా