Mallikarjun Kharge : బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉంది
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
Mallikarjun Kharge Capita Income : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కేంద్రంపై, బీజేపీపై మండిపడ్డారు. చేసింది తక్కువ ప్రచారానికి ఎక్కువ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ప్రచారం కంటే కాంగ్రెస్ పార్టీ రక్షణ గొడుగు బలంగా ఉందన్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ప్రకారం ప్రస్తుత ధరల మేరకు చూస్తే తలసరి ఆదాయం 2022-23లో రూ. 1, 72,000గా అంచనా(Capita Income) వేసిందన్నారు. 2014-15లో అది రూ. 86, 647గా ఉందని తెలిపారు ఖర్గే. ఇది దాదాపు 99 శాతం పెరుగుదలను సూచిస్తుందని ఇది ఒక రకంగా ఆర్థిక రంగం పరంగా ఇబ్బందికరమేనని పేర్కొన్నారు.
మంగళవారం ఏఐసీసీ చీఫ్ దీనిని హెడ్ లైన్స్ మేనేజ్ మెంట్ గా అభివర్ణించారు. ఒక రకంగా అన్నింటిని మ్యానేజ్ చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు .
2014-2015 లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత తలసరి ఆదాయం రెట్టింపు(Mallikarjun Kharge Capita Income) అయ్యిందని ఎన్ఎస్ఓ డేటా వెల్లడించిందని తెలిపారు. ప్రజల ఆదాయం పెరగక పోగా బీజేపీ ప్రచారం మాత్రం బాగా పెరిగిందని మండిపడ్డారు. ప్రధానమంత్రి మోదీ నిద్ర పోతున్నారని ఆవేదన చెందారు ఖర్గే.
ట్విట్టర్ వేదికగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మాయ మాటలు చెప్పడంలో మోదీని మించిన నాయకుడు లేరంటూ ఎద్దేవా చేశారు. ఆయన గతంలో ఇచ్చిన హామీలను మరిచి పోయారని ప్రస్తుతం కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ దేశంలో సమస్యలు పేరుకు పోయినా పరిష్కరించేందుకు సమయం చాలడలం లేదన్నారు. కేవలం ప్రచారంపై పెట్టిన ఫోకస్ సమస్యలపై పెట్టి ఉంటే బావుండేదన్నారు ఖర్గే.
Also Read : మార్చి 10న రాహుల్ పై విచారణ