Congress Plenary Comment : ఆశల పల్లకీ సరే ఆచరణ ఏది
బీజేపీని దించడం సాధ్యమేనా
Congress Plenary Comment : దేశం అంటేనే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటేనే దేశం అనేలా విస్తరించిన సమున్నత చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తనను తాను స్మరించుకునే పనిలో పడింది. వయస్సు మీద పడిన పెద్దాయనకు పోస్ట్ కట్టబెట్టిన కాంగ్రెస్ ఈ దేశానికి ఏం చేయాలని అనుకుంటుందో చెప్పడంలో ఇంకా తాత్సారం చేస్తోంది.
ఒకటా రెండా ఏకంగా 137 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఆ పార్టీలో ఎవరు పవర్ ఫుల్ అనేది నేటికి అంతు పట్టడం లేదు ఆ పార్టీ శ్రేణులకే.
ప్రస్తుతం రోడ్ మ్యాప్ ను సిద్దం చేసే పనిలో పడింది. రాయ్ పూర్ లో 15,000 మందితో 85వ ప్లీనరీ నిర్వహించింది. కానీ కార్య నిర్వాహక కమిటీని ఏర్పాటు చేయలేదు.
చివరకు అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టాలనే దానిపై మల్లగుల్లాలు పడింది. నేటికీ ఎవరు ఏం చేస్తున్నారో కింది స్థాయి క్యాడర్ కు తెలియడం లేదు.
దాదాపు ఐసీయూకు చేరిన కాంగ్రెస్ పార్టీకి(Congress Plenary Comment) తిరిగి జీవం పోశారు యువ నాయకుడు రాహుల్ గాంధీ. ఆయన గత కొంత కాలం నుంచీ మోదీని, బీజేపీ చేస్తున్న మోసాలు, ఆగడాలను ప్రశ్నిస్తున్నారు..నిలదీస్తున్నారు.
ఇదే సమయంలో ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆ పార్టీకి ప్రాణం పోసింది. భారీ ఎత్తున జనం ఆదరించారు. అన్ని వర్గాల ప్రజలు హత్తుకున్నారు. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ దానిని కంటిన్యూగా చేసి ఉంటే మరికొంత బలం కలిగేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఏఐసీసీ చీఫ్ గా మల్లికార్జున్ ఖర్గే అయినా అంతా గాంధీ కుటుంబం కనుసన్నలలోనే పార్టీ నడుస్తోంది. ఇదే విషయాన్ని ప్లీనరీలోలేవదీశారు..ప్రశ్నించారు కూడా. విచిత్రం ఏమిటంటే సీడబ్ల్యూసీకి సంబంధించి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఖర్గే నామినేటెడ్ చేస్తారంటూ ప్రకటించారు ఆ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ జైరాం రమేష్.
యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.పాత కాలం నాటి సంప్రదాయ పద్దతులకు స్వస్తి చెపితేనే పార్టీ మనుగడ సాధిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు వీడుతున్నారు. ఇటీవల ఆనాటి గవర్నర్ రాజగోపాలాచిరి ముని మనవడు సీఆర్ కేశవన్ గుడ్ బై చెప్పాడు. గులాం నబీ ఆజాద్ కొత్త కుంపటి పెట్టుకున్నాడు.
ప్రతి చోటా కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఇక యాత్రలో ఉన్న సమయంలోనే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చింది. చాలా చోట్ల కలిసి కొనసాగుతోంది.
ఇక తమిళనాడులో డీఎంకేతో దోస్తీ చేస్తోంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీలో ఉన్నా సర్కార్ ను కోల్పోయింది. ఇక బీహార్ లో ఆర్జేడీ తో కలిసి ప్రభుత్వంలో కొనసాగుతోంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి.
గుజరాత్ లో భారీ ఓటమిని మూటగట్టుకుంది. పవర్ లో ఉన్న పంజాబ్ ను చెత్త నిర్ణయాల కారణంగా పూర్తిగా ఆప్ చేతిలోకి వెళ్లి పోయింది. ఎక్కడా కాంగ్రెస్ ఒంటరిగా యుద్దం చేసే స్థితిలో లేదు.
ప్రస్తుతం ఆ పార్టీకి కర్ణాటకలో జనం ఆదరిస్తున్నారు. దానిని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంది. ఈ తరుణంలో ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలి.
కాంగ్రెస్ పార్టీ(Congress Plenary) భావజాలం మారాలని , దేశాన్ని ప్రభావితం చేస్తున్న అనేకానేక సమస్యలను పార్టీ తనదైన గొంతుక వినిపించాలని పిలుపునిచ్చారు.
ఇదే క్రమంలో పి.చిదంబరం దేశంలోని 50 శాతానికి పైగా నిరాదరణకు గురవుతున్నారని వారికి భరోసా ఇచ్చేలా ఆర్థిక వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. ఇదంతా పక్కన పెడితే సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాబోయే కాలం కాంగ్రెస్ పార్టీదేనని, భావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి బీజేపీతో యుద్దం చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ దేశంలో ఆక్టోపస్ లా విస్తరించిన బీజేపీని ఎదుర్కొనేందుకు ఇప్పటి వరకు కాంగ్రెస్ వద్ద సరైన రోడ్ మ్యాప్ లేదు.
అంతకు మించిన యాక్షన్ ప్లాన్ అసలే లేదు. ఎవరికైనా ఆశలు ఉండడంలో తప్పు లేదు..కానీ ఊహల పల్లకీలో ఊరేగితే విజయం వరిస్తుందా అన్నది పార్టీ ఆలోచించాలి. గణనీయమైన క్యాడర్ కలిగిన కాంగ్రెస్ ఇకనైనా కార్యోన్ముఖుల్ని చేయాలి.
అప్పుడే ఏమైనా అధికారంలోకి రాక పోయినా కనీసం ప్రతిపక్షంగానైనా ఉంటుదని అనుకోవాలి. అత్యంత బలమైన నాయకుడిగా ముద్ర పడిన మోదీని ఢీకొనేందుకు పార్టీ ఏం చేస్తుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read : అంతిమ విజయం మనదే – సోనియా