Congress Plenary : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్లీన‌రీ షురూ

రాబోయే ఎన్నిక‌ల‌పై రోడ్ మ్యాప్

Congress Plenary : 137 ఏళ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీకి(Congress Plenary) సంబంధించి కీల‌క‌మైన 85వ ప్లీన‌రీ స‌మావేశం ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ్ పూర్ లో ప్రారంభ‌మైంది. ఫిబ్ర‌వ‌రి 24 నుంచి 26 వ‌ర‌కు జ‌రుగుతాయి. మూడు రోజుల పాటు ఈ స‌మావేశాలు కొన‌సాగుతాయి. ఇందులో భాగంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనుంది పార్టీ. ఈ స‌మావేశానికి 15,000 మందికి పైగా ప్ర‌తినిధులు హాజ‌ర‌వుతున్నారు. పార్టీ స్టీరింగ్ క‌మిటీ స‌మావేశంలో సీడబ్ల్యూసీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్నారు.

2024 లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు స్ప‌ష్ట‌మైన రోడ్ మ్యాప్ ను రూపొందించ‌డంపై ఫోక‌స్ పెట్ట‌నున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎదుర్కోవడంతో పాటు భావ సారూప్య‌త క‌లిగిన పార్టీల‌తో ఎన్నిక‌ల బంధాన్ని ఏర్ప‌ర్చేందుకు వ్యూహాన్ని ఖ‌రారు చేస్తుంద‌ని భావిస్తున్నారు. మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కొత్త‌గా అధ్య‌క్షుడిగా ఎన్నికైన త‌ర్వాత జ‌రుగుతున్న తొలిసారి జ‌రుగుతున్న ప్లీన‌రీ(Congress Plenary) స‌మావేశం ఇదే కావ‌డం విశేషం. ఇక ఈ ప్లీన‌రీ స‌మావేశానికి కాంగ్రెస్ అగ్ర నాయ‌క‌త్వం హాజ‌రుకానుంది.

కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడబ్ల్యూసీ) స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయా అనే ప్ర‌శ్న‌కు కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి క‌మ్యూనికేష‌న్ ఇన్ ఛార్జ్ జైరాం ర‌మేష్ ఇవాళ జ‌రిగే స్టీరింగ్ క‌మిటీ నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలిపారు. ఈ విష‌యం ఈ కీల‌క మీటింగ్ లో ఖ‌చ్చితంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తుంద‌న్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

ఇవాళ జ‌రిగే ప్లీన‌రీలో ఆరు తీర్మానాల‌పై ప‌రిశీల‌న ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 25, 26 తేదీల‌లో ఈ తీర్మానాల‌పై చ‌ర్చ జ‌రుగుతుంది. 25న రాజ‌కీయ‌, ఆర్థిక‌, అంత‌ర్జాతీయ అంశాల‌కు సంబంధించి తీర్మానాలు చేస్తారు. 26న వ్య‌వ‌సాయం, రైతుల సంక్షేమం , సామాజిక న్యాయం, సాధికార‌త , యువ‌త‌కు సంబంధించిన తీర్మానాల‌పై చ‌ర్చిస్తారు.

Also Read : ఆప్ కౌన్సిల‌ర్ బీజేపీలోకి జంప్

Leave A Reply

Your Email Id will not be published!