Congress Protest : ఈశ్వ‌ర‌ప్ప రాజీనామా చేయాలి- డీకేఎస్

క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ నిర‌స‌న‌లు

Congress Protest : మంత్రి ఈశ్వ‌ర‌ప్ప రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు మిన్నంటాయి. కాంట్రాక్ట‌ర్ సంతోష్ పాటిల్ సూసైడ్ కు కార‌ణం మంత్రి కేఎస్ ఈశ్వ‌ర‌ప్ప కార‌ణం అంటూ ఆయ‌న‌ను వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఇవాళ క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ చీఫ్ డీకే శివ‌కుమార్ (Congress Protest)ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న చేప‌ట్టారు.

డీకే శివ‌కుమార్ తో పాటు మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌, ఇత‌ర నేత‌ల‌ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. కాంట్రాక్ట‌ర్ ను ఆత్మ‌హ‌త్య‌కు పురిగొల్పేందుకు కార‌ణ‌మైన మంత్రిని కేబినెట్ నుంచి తొల‌గించాల‌ని, ఆయ‌న వెంట‌నే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్.

బెంగ‌ళూరులో చేప‌ట్టిన కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న(Congress Protest) తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. కాంట్రాక్ట‌ర్ సంతోష్ పాటిల్ తాను చేప‌ట్టిన రూ. 4 కోట్ల బిల్లులు మంజూరు చేసేందుకు మంత్రితో పాటు ఆయ‌న ఇద్ద‌రు అనుచ‌రులు 40 శాతం క‌మీష‌న్ అడిగారంటూ ఆరోపించారు.

ఈ మేర‌కు ఉడిపి హొట‌ల్ లో సంతోష్ పాటిల్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా సూసైడ్ నోట్ కూడా చేశారు. త‌న మృతికి కార‌ణం మంత్రి, అనుచ‌రులేనంటూ ఆరోపించాడు.

త‌న‌ను ఆదుకోవాలంటూ ప్ర‌ధాని మోదీ, లింగాయ‌త్ నేత బీఎస్ యెడియూర‌ప్ప ఆదుకోవాల‌ని కోరాడు. దీంతో మృతుడి త‌మ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు మంత్రి, అనుచ‌రుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

దీంతో ఈ అంశం రాజ‌కీయ దుమారం రేగింది. ఇదిలా ఉండ‌గా సీఎం బొమ్మై వేచి చూసే ధోర‌ణి అవ‌లంభిస్తున్నారు. మంత్రి మాత్రం తాను రిజైన్ చేసే ప్ర‌స‌క్తి లేదంటున్నారు

Also Read : స్ఫూర్తిదాయ‌కం అంబేద్క‌ర్ జీవితం

Leave A Reply

Your Email Id will not be published!