AFSA Extended : నాగాలాండ్ 9 జిల్లాల్లో వివాదాస్పద చట్టం
పొడిగించిన కేంద్ర ప్రభుత్వం
AFSA Extended : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పద చట్టం ఏఎఫ్ఎస్పీఏ(AFSA Extended) నాగాలాండ్ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో విస్తరించింది. ఇందుకు సంబంధించి నాగాలాండ్ లోని దిమాపూర్ , నియులాండ్, చుమౌకెడిమా, మోన్, కిఫిరే, నోక్లక్ , ఫేక్, పెరెన్ తో పాటు జున్ హెబోటోతో సహా 9 జిల్లాల్లో సాయధ బలగాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అదనంగా నాలుగు జిల్లాల్లోని 16 పోలీస్ స్టేషన్ ల పరిధిలోకి వచ్చే ప్రాంతాలలో కూడా విస్తరించింది.
ఇందులో కోహిమా జిల్లాలోని ఐదు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. మోకోచ్ చుంగ్ జిల్లాలో ఆరు పోలీస్ స్టేషన్లు , లాంగ్లెంగ్ జిల్లాలోని యాంగ్లోక్ పోలీస్ స్టేషన్ , వోకా జిల్లాలో నాలుగు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.
ఈ 16 పోలీస్ స్టేషన్లు కొహిమా జిల్లాలోని ఖుజమా, కొహిమా నార్త్ , కోహిమా సౌత్, జుబ్జా, కెజోచా పోలీస్ స్టేషన్లు కలిగి ఉన్నాయి. మోకోక్ చుంగ్ జిల్లాలోని మాంగ్ కోలెంబ, మోకోక్ చుంగ్ ఎల్, లాంగ్ తో , తులి, లాంగ్ చెమ్ , అనాకి సీ పోలీస్ స్టేషన్ల ఉన్నాయి.
లాంగ్లెంగ్ జిల్లాలోని యాంగ్లోక్ పోలీస్ స్టేషన్ , వోఖా జిల్లాలోని భండారి, చంపాంగ్ , రాలన్, సుంగ్రో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.
ఆర్మ్ డ్ ఫోర్సెస్ (ప్రత్యేక అధికారాలు) చట్టం , 1958 లోని సెక్షన్ 3 కింద అంతరాయం కలిగించే ప్రాంతంగా ఆరు నెలల పాటు అక్టోబర్ 1, 2022 నుండి అమలులోకి వస్తుంది. ముందుగా ఉపసంహరించు కోక పోతే ఎంహెచ్ఏ జారీ చేసిన నోటిఫికేషన్ లో పేర్కొంది.
Also Read : 21 రోజులు బ్యాంకులకు సెలవు