Oxfam 2021 : కరోనా కోట్లాది భారతీయులను మరింత పేదలుగా మార్చేస్తే అదే ధనవంతులకు, వ్యాపారవేత్తలకు, ఫార్మా కంపెనీలకు కాసులు కురిపించేలా చేసింది. గత ఏడాది 40 మంది బిలియనీర్లు ఉండగా ఈసారి భారత్ నుంచి ఇంకొందరు చేరడం విశేషం.
ఆ సంఖ్య 142కి చేరింది. ఇదే విషయాన్ని ఆక్స్ ఫామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. ఫ్రాన్స్, స్వీడన్, స్విట్జర్లాండ్ ల కంటే భారత్ ఇప్పుడు ఎక్కు మంది బిలియనీర్లను కలిగి ఉందని స్పష్టం చేసింది.
ఈ ఏడాది 2022 ప్రపంచ ఆక్స్ ఫామ్ నివేదిక ప్రకారం దేశాన్ని నాశనం చేసిన, పేదరికాన్ని మరింత దిగజార్చిన కోవిడ్ -19 సమయంలో దేశంలోని ధనవంతులకు కరోనా అత్యంత ఎక్కువ లాభాన్ని చేకూర్చి పెట్టిందని వెల్లడించింది.
వారంతా $720 బిలియన్ల సంపదను కలిగి ఉన్నారని తెలిపింది. కరోనా మహమ్మారి సమయంలో స్టాక్ ధరల నుంచి క్రిప్టో , వస్తువుల దాకా ప్రతి దాని విలువ పెరగడంతో సంపద అనూహ్యంగా భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిందని ఆక్స్ ఫామ్(Oxfam 2021) స్పష్టం చేసింది.
ఇక బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని 500 మంది ధనవంతులు గత ఏడాది తమ నికర విలువను పెంచుకున్నారు. ఇక భారత దేశంలో పట్టణ నిరుద్యోగం పెరిగింది. ఆహార అభ్రదత మరింత దిగజారిందని ఆందోళన వ్యక్తం చేసింది.
2016లో ఆస్తి పన్ను రద్దు, కార్పొరేట్ లెవీల్లో తీవ్ర కోతలు, పరోక్ష పన్నుల పెరుగుదల వంటి విధానాలు సంపన్నులను ధనవంతులుగా మార్చేందుకు దోహద పడ్డాయని ఆక్స్ పామ్ వెల్లడించింది.
Also Read : ఆసియా అత్యుత్తమ సంపన్నుడిగా జావో