Corona Virus India : దేశవ్యాప్తంగా బాగా పెరిగిన కరోనా కేసులు..

Corona Virus India : దేశవ్యాప్తంగా కరోనా దూసుకెళ్తోంది. కంట్రోల్ లేకుండా పోయింది. వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసులు బాగా పెరుగుతున్నాయి. తాజా బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెప్పిందో తెలుసుకుందాం.

తాజాగా… వరుసగా రెండోరోజు కరోనా కేసులు 3వేలకు పైగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్త కేసులు 3,095 నమోదయ్యాయి. (ఇవి గురువారం రోజంతా నమోదైన కేసులు). ఇండియాలో(Corona Virus India) మొన్న (బుధవారం) 3,016 కొత్త కేసులు వచ్చాయి. అంటే రెండు రోజుల్లో 6వేల కేసులు. కరోనా కంట్రోల్ లేకుండా ఉందని ఈ లెక్కలే చెబుతున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.61 శాతం అవ్వగా… వారపు పాజిటివిటీ రేటు 1.91 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

గత 24 గంటల్లో కరోనాతో 5గురు చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,30,867కి చేరిది. నిన్న కేరళలో ముగ్గురు చనిపోగా… గుజరాత్ , గోవాలో ఒక్కొక్కరు మరణించారు. ప్రస్తుతం ఇండియాలో మొత్తం నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.47 కోట్ల (4,47,15,786)కి చేరిది. వీటిలో యాక్టివ్ కేసులు 0.03 శాతంగా ఉన్నాయి.

ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 15వేల మార్క్ దాటి… 15,208గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1,390 మంది కరోనా నుంచి రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 4,41,69,711కి చేరింది. రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది.

2023లో ఒకే రోజు ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. ఇండియాలో(Corona Virus India) ఇప్పటివరకూ 220.65 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. వీటిలో 95.20 కోట్లు.. రెండో డోస్‌వి ఉన్నాయి. అలాగే 22.86 కోట్ల ప్రికాషన్ డోసులున్నాయి. గత 24 గంటల్లో 6,553 డోసుల వ్యాక్సిన్ వేశారు.

ఢిల్లీలో నిన్న కొత్తగా 295 పాజిటివ్ కేసులు వచ్చాయి. అక్కడ పాజిటివిటీ రేటు 12.48 శాతంగా ఉంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ కరోనాపై ఫోకస్ పెడుతున్నాయి. చర్యలు తీసుకుంటున్నాయి.

Also Read : ప్రజాస్వామ్యంపై ‘విదేశాల ఆమోదం అవసరం లేదు – కపిల్ సిబల్

 

Leave A Reply

Your Email Id will not be published!