Netflix Lay Off : కాస్ట్ కటింగ్ ఎఫెక్ట్ నెట్ ఫ్లిక్స్ షాక్
300 మంది ఎంప్లాయిస్ తొలగింపు
Netflix Lay Off : ప్రైవేట్ రంగం అంటేనే సెక్యూరిటీ చాలా తక్కువ. నిరంతరం పోటీని ఎదుర్కోవాల్సిందే. ఎప్పుడు ఏ క్షణం మేనేజ్ మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. ప్రస్తుతం కరోనా తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలు కుదేలయ్యాయి.
కానీ డిజిటల్ , మీడియా, ఫార్మా, క్రీడా రంగాలు మాత్రం భారీ ఎత్తున లాభ పడ్డాయి. కానీ సీన్ చూస్తే వినోద రంగంలో టాప్ రేంజ్ లో కొనసాగుతూ
వస్తున్న నెట్ ఫ్లిక్స్ కోలుకోలేని షాక్ ఇచ్చింది.
తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు బ్లాంక్ స్లిప్ ఇచ్చేసింది. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయలేక ఉన్న సబ్ స్క్రైబర్లను కోల్పోతూ వస్తోంది.
ఉన్న వారిని అట్టి పెట్టుకునేందుకు నానా తంటాలు పడుతోంది నెట్ ఫ్లిక్స్. ఇదంతా మార్కెట్ మాయాజాలం. మనిషిని సరుకుగా ఎప్పుడైతే
చూడడం మొదలు పెట్టిందో వాళ్లు యంత్రాలుగా మారి పోయారు.
ఈ తరుణంలో నెట్ ఫ్లిక్స్(Netflix Lay Off) ఏంటి ప్రతి కంపెనీ ఇలాగే ఆలోచిస్తుంది. నీతో సత్తా ఉంటే సరిపోదు. మార్కెట్ లో కూడా సంస్థకు
మంచి పేరు తీసుకు వచ్చేలా చేయగలగాలి.
ఒక రకంగా చెప్పాలంటే ఏ స్కిల్స్ వచ్చినా ముందు మార్కెటింగ్ స్కిల్స్ రాక పోతే మాత్రం జాబ్ అన్నది గాలిలో దీపం లాంటిదే. అది ఎప్పుడు ఆరి పోతుందో తెలియదన్నమాట.
ఇక ఈ అమెరికన్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్ ఫ్లిక్స్ 300 మంది జాబర్స్ కు గుడ్ బై చెప్పింది. సదరు కంపెనీ చెప్పిన సిల్లీ రీజన్ ఏమిటంటే కాస్ట్
కటింగ్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చావు కబురు చల్లగా చెప్పింది.
గత నెలలో కూడా ఇలాగే తీసేసింది. ఇందులో కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. మరికొంత సిబ్బంది ఉన్నారు. 2022లో తొలి త్రైమాసికంలో
నెట్ ఫ్లిక్స్ 2 లక్షల సబ్ స్క్రైబర్లను(Netflix Lay Off) కోల్పోయింది.
Also Read : జై హింద్ జై మహారాష్ట్ర – కేతకి చితాలే