Penny Mordaunt : పెన్నీ మోర్డాంట్ గేమ్ ఛేంజ‌ర్ కానుందా

రిషి సున‌క్ కు చుక్క‌లు చూపిస్తున్న ఎంపీ

Penny Mordaunt : యావ‌త్ ప్ర‌పంచం అత్యంత ఆస‌క్తితో ఎదురు చూస్తోంది బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి ఎవ‌రు అవుతార‌నే దానిపై. ఇప్ప‌టికే ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

పీఎం రేసులో భార‌త సంతతికి చెందిన రిషి సున‌క్ ముందంజ‌లో ఉన్నారు. తొలి రౌండ్ ముగిసే స‌రికి రిషి సున‌క్ ముందంజ‌లో ఉన్నారు. ఆయ‌న‌కు క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి చెందిన 88 ఎంపీల ఓట్లు ద‌క్కాయి.

ఇక ఊహించ‌ని రీతిలో దూసుకు వ‌చ్చారు పెన్నీ మోర్డాంట్(Penny Mordaunt) . ఆమెకు 67 ఓట్లు పోల్ అయ్యాయి. మొద‌టి రౌండ్ ముగిసే స‌రికి ఆరుగురు బ‌రిలో ఉన్నారు. 11 మంది పోటీ ప‌డ్డారు.

ఈనెల 21న ఇద్ద‌రు మాత్ర‌మే పీఎం రేసులో మిగులుతారు. రెండు ల‌క్ష‌ల మంది దాకా పార్టీ అభ్య‌ర్థులు పీఎం ఎవ‌ర‌నే దానిని నిర్ణ‌యిస్తారు.

ఇంకా రెండో రౌండ్ మిగిలి ఉంది. మొన్న‌టి దాకా రిషి సున‌క్ కు ఎదురే లేద‌ని అనుకున్నారంతా కానీ అనూహ్యంగా పెన్నీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో పోటీ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారింది.

ఒక‌ప్పుడు జార్జ్ డ‌బ్ల్యు బుష్ ప్ర‌చారంలో స్వ‌చ్చందంగా పాల్గొన్నారు పెన్నీ. మాజీ ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శిగా ఉన్నారు. క‌న్జ‌ర్వేటివ్ పార్టీకి నాయ‌క‌త్వం వ‌హించే ప్ర‌చారాన్ని ప్రారంభించారు.

రిషి సున‌క్ కు ముప్పుగా మారారు. బ్రిట‌న్ లోని బెట్టింగ్ హౌస్ ల‌లో పెన్నీ ఫేవ‌రేట్ గా మారారు. పాపులారిటీ పోల్స్ లో అగ్ర‌స్థానంలో ఉన్న‌ట్లు చూపించ‌డం విశేషం.

ఆమెకు 49 ఏళ్లు. ప‌బ్లిక్ రిలేష‌న్స్ లో మంచి ఎక్స్ ప‌ర్ట్ . కేవ‌లం 21 ఓట్ల తేడాతో రెండో స్థానంలో నిలిచారు. ఇంకా రెండో రౌండ్ మిగిలి ఉంది. సెప్టెంబ‌ర్ 5న పీఎం ఎవ‌రు అవుతార‌నేది తేలుతుంది.

Also Read : తొలి రౌండ్ లో రిషి సున‌క్ దే హ‌వా

Leave A Reply

Your Email Id will not be published!