Hardik Pandya : ఆట కంటే నాకు దేశం ముఖ్యం – పాండ్యా
సంచలన వ్యాఖ్యలు చేసిన ఆల్ రౌండర్
Hardik Pandya : యూఏఈ వేదికగా ప్రారంభమైన మెగా టోర్నీ ఆసియా కప్ -2022 (Asia Cup 2022) లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
గత ఏడాది 2021లో ఇదే వేదికగా టి20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఘోరంగా ఓటమి పాలైంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడించింది పాకిస్తాన్ ను.
మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 రన్స్ కే చాప చుట్టేసింది. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా 19.4 ఓవర్లలో భారత్ సత్తా చాటింది. ప్రధానంగా హార్దిక్ పాండ్యా కీలకమైన పాత్ర పోషించాడు.
25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఆపై విజయం కష్టమని అనుకున్న తరుణంలో 17 బంతులు మాత్రమే ఎదుర్కొన్న పాండ్యా 33 రన్స్ చేశాడు. మొత్తంగా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్యా మీడియాతో మాట్లాడాడు. తనకు ఆట కంటే తనకు దేశం ముఖ్యమని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా పాండ్యాకు పెద్ద ఎత్తున ప్రశంసలు లభిస్తున్నాయి. నా ముందు ఛేజింగ్ తనను మరింత ఉత్తేజితుడిని చేస్తుందన్నాడు. ఒక ఆటగాడికి ఛాలెంజ్ అన్నది రాటు దాలేలా చేస్తుందన్నాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya).
పాకిస్తాన్ ఆటగాళ్లు ఎవరో, బౌలర్ల సత్తా ఏమిటో తాను గ్రహించ గలిగానని తెలిపాడు. అందుకే తాను సత్తా చాటానని, ఇది ఆటలో భాగమని తెలిపాడు.
Also Read : హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో