Court 2014 Netflix : ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో టాప్ లో కొనసాగుతోంది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు భిన్నమైన అంశాలపై ఫోకస్ పెడుతోంది. మొన్నటికి మొన్న ఓ మహిళా జర్నలిస్ట్ నిరాధార ఆరోపణలకు గురై , జైలు పాలై చివరకు విడుదలైన విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. అదే స్కూప్ గా వచ్చింది. ప్రేమ, సెక్స్ , స్కామ్స్ , భావోద్వేగాలను తడిమి చూసేలా నెట్ ఫ్లిక్స్ జాగ్రత్త పడుతోంది. తాజాగా మరో భిన్నమైన కథను ఎంచుకుంది. అదే కోర్ట్ 2014. ప్రస్తుతం ఇది అందుబాటులో ఉంది.
కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమైన వాళ్లకు నెట్ ఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ , ఆహా లాంటివి ఆలోచింప చేసే కథాంశాలకు ప్రయారిటీ ఇస్తున్నాయి. కొన్ని వినోదానికి అగ్రతాంబూలం ఇస్తే మరికొన్ని కేవలం సీరియస్ కథల వైపు చూస్తున్నాయి. ఇందులో కోర్ట్ 2014(Court 2014) ఇప్పుడు చర్చకు దారి తీసేలా చేసింది. ఇది మరాఠీ, ఇంగ్లీష్ , హిందీ భాషలలో ఉంది.
కథేంటి అంటే ఒక జనాపద గాయకుడు రాజకీయంగా, సామాజికంగా ఆరోపించిన పాటల ద్వారా మురుగు నీటి కార్మికుడి ఆత్మహత్యకు ప్రేరేపించాడనే ఆరోపణపై అరెస్ట్ కాబడతాడు. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన సందర్భంగా చోటు చేసుకున్న వాదనలు, సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇందులో వీర సతీదార్ , వివేక్ గోంబర్ , గీతాంజలి కులకర్ణి, ప్రదీప్ జోషి, శిరీష్ పవార్ , ఉషా బానే తమ పాత్రల్లో ఒదిగి పోయారు.
Also Read : Twitter Comment : ‘పిట్ట కూత’కు ముకుతాడు