Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట
విదేశాలకు వెళ్లేందుకు పర్మిషన్
Jacqueline Fernandez : మనీ లాండరింగ్ కేసును ఎదుర్కొన్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్(Jacqueline Fernandez) కు భారీ ఊరట లభించింది. ఈ మేరకు విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఐఐఎఫ్ఏ అవార్డులకు హాజరు అయ్యేందుకు మే 25 నుంచి 27 వరకు అబుదాబి వెళ్లాల్సి ఉందని , తనకు అనుమతి కావాలని కోరుతూ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
కాగా ఫెర్నాండెజ్ దాఖలు చేసిన దరఖాస్తును ప్రత్యేక న్యాయమూర్తి శైలేంద్ర మాలిక్ అనుమతించారు. మనీ లాండరింగ్ కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నారు. అంతే కాకుండా జూన్ 12 వరకు విదేశాలలో పర్యటించేందుకు వీలుగా పర్మిషన్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అంతే కాకుండా మే 28 నుంచి జూన్ 12 వరకు ఇటలీ లోని మిలాన్ కు వెళ్లేందుకు కూడా న్యాయమూర్తి అనుమతించడం విశేషం. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న జాక్వెలిన్ కు గత ఏడాది నవంబర్ 15న కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ అరెస్ట్ కాలేదు.
రెలిగేర్ ఎంటర్ ప్రైజెస్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య ఆదితి సింగ్ ను మోసం చేసి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్ పై ఢిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఎఫ్ ఐ ఆర్ ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది.
నిధుల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో శివిందర్ మోహన్ సింగ్ 2019 అక్టోబర్ లో అరెస్ట్ అయ్యారు. సుఖేశ్ చంద్రశేఖర్, అతని సహచరులు ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ ఆమె భర్తకు బెయిల్ ఇప్పిస్తామంటూ హామీ ఇచ్చి ఆదితి నుండి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం.
Also Read : TTD Security