Booster Dose : ఈనెల 10 నుంచి దేశంలోని పెద్దలందరికీ కోవిడ్ బూస్టర్ డోస్ ( Booster Doseప్రారంభిస్తున్నట్లు కేంద్ర సర్కార్ ప్రకటించింది. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వారంతా , కనీసం 9 నెలల ముందు వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న వారంతా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్ టీకా కేంద్రాలలో అందుబాటులో బూస్టర్ డోస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
9 నెలల తర్వాత పూర్తి చేసిన వారంతా దీనికి అర్హులని తెలిపింది. ఈ సదుపాయం అన్ని ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
దేశంలో మహమ్మారి పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ చైనాలో అంటు వ్యాధుల తాజా పెరుగుదల దృష్ట్యా బూస్టర్ డోస్( Booster Dose ) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
నిపుణులు సూచించిన మేరకు వ్యాక్సిన్ డోస్ ఇవ్వాలని నిర్ణయించామని పేర్కొంది. ప్రభుత్వ టీకా కేంద్రాల ద్వారా మొదటి, రెండో డోసు ఇవ్వాలని తెలిపింది.
ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ కార్మికులు , 60 ఏళ్లు పైబడిన జనాభాకు ముందు జాగ్రత్త మోతాదుల ద్వారా కొనసాగుతున్న ఉచిత టీకా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేసింది.
ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేస్తామని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనవరి 2021లో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యకరమం కౌమారదశలో ఉనన వారితో పాటు అనేక దశల్లో పోడిగించబడింది.
సీనియర్ సిటిజన్లకు మేలు చేకూర్చాలనే ఉద్దేశంతోనే టీకాలు ఇవ్వాలని నిర్ణయించామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
Also Read : కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ కు ఇవ్వాలి