Covid-19 : దేశంలో కరోనా కలకలం
142 కొత్తగా కేసులు
Covid-19 : న్యూఢిల్లీ – నిన్నటి దాకా ప్రశాంతంగా ఉన్న భారత దేశంలో మరోసారి కరోనా పంజా విసురుతుండడంతో భయాందోళనకు గురవుతున్నారు. కరోనా దెబ్బకు కేంద్రంలో కొలువు తీరిన మోదీ బీజేపీ సంకీర్ణ సర్కార్. దేశంలో వేగంగా కరోనా(Covid-19) విస్తరిస్తుండడంతో అలర్ట్ అయ్యింది. పీఎం అధ్యక్షతన సమీక్ష చేపట్టారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. కరోనాకు సంబంధించి మార్గ దర్శకాలు జారీ చేసింది.
Covid-19 Cases Again Raising
తాజాగా కరోనా కొత్త వేరియంట్ జేఎన్ -1 దేశ వ్యాప్తంగా విస్తరించింది. దేశ వ్యాప్తంగా కొత్తగా 142 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఉత్తర ప్రదేశ్ , కేరళలో కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఐదుగురు మృతి చెందారు.
కోవిడ్ తో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. దీంతో రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన హై లెవల్ మీటింగ్ జరిగింది. కరోనా మహమ్మారి కట్టడికి ఎంత ఖర్చు అయినా సరే భరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసింది కేంద్రం.
Also Read : Damodara Raja Narasimha : కరోనా పట్ల అప్రమత్తం అవసరం