DGP Ravi Gupta : డ్ర‌గ్స్ పై ఉక్కుపాదం – డీజీపీ

ఎవ‌రైనా స‌రే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

DGP Ravi Gupta : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర డీజీపీ ర‌వి గుప్తా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆదేశాల మేర‌కు మాద‌క ద్ర‌వ్యాలు న‌గ‌రంలో, రాష్ట్రంలో లేకుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. బుధ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌భుత్వం డ్ర‌గ్స్ ర‌హిత రాష్ట్రంగా మార్చాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌న్నారు. ఆ మేర‌కు త‌మ సార‌థ్యంలో విస్తృతంగా దాడులు, సోదాలు చేస్తోంద‌న్నారు.

DGP Ravi Gupta Comment about Drugs

రాష్ట్రంలో మాదక ద్ర‌వ్యాల‌ను త‌రిమి కొట్టేందుకు అంద‌రం ఏకం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పిలుపునిచ్చారు డీజీపీ ర‌వి గుప్తా. ఈ విష‌యంలో డ్ర‌గ్స్ వ్యాపారాలు, స‌ర‌ఫ‌రా చేసే వారిని ఎట్టి ప‌రిస్తితుల్లో ఉపేక్షించే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు . ఇప్ప‌టికైనా జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని లేక పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొన్నారు.

డ్ర‌గ్స్ ను త‌రిమి కొట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుని తీరుతామ‌ని వార్నింగ్ ఇచ్చారు డీజీపీ. ఇదిలా ఉండ‌గా కొత్త‌గా సీఎంగా కొలువు తీరిన ఎనుముల రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే పోలీస్ శాఖ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. ఇందులో భాగంగా డ్ర‌గ్స్ పై సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

ఎవ‌రైనా స‌రే, ఎంత‌టి వారైనా స‌రే , ఏ ప‌ద‌వుల్లో ఉన్నా సరే వారిని ప‌ట్టుకుని తీరాల్సిందేన‌ని పేర్కొన్నారు. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం.

Also Read : Covid-19 : దేశంలో క‌రోనా క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!